రజినీకాంత్ 'రోబో' తర్వాత చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. కానీ ఎన్ని సినిమాలు ప్లాప్ అయినా రజిని సినిమా వస్తుందంటే ఆ మజానే వేరు. అయితే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్న 'కబాలి' సినిమా అమెరికాలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇంకేముంది 'కబాలి' హిట్ అయ్యిందనే వార్త స్ప్రెడ్ అయిపోయింది. ఈ సినిమా ఇండియా అంతటా రేపు(జులై 22) రిలీజ్ అవుతుంది. అమెరికాలో వేసిన స్పెషల్ షో ని రజినీకాంత్ ఫ్యామిలీతో చూసారని సమాచారం. ఈ సినిమా చూసి ప్రేక్షకులు హ్యాపీగా ఫీల్ అయ్యారని... ఇదంతా చూసిన రజినీకాంత్ తృప్తి పడ్డారని టాక్. ఈ సినిమా అక్కడ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో.. ఇక్కడ ఇండియా లో ఇంకా అంచనాలను పెంచేసింది. మరి రజిని స్టామినా అంటే దీనిని బట్టే అర్ధమవుతుంది. అయితే అక్కడ ఎన్నారై లు ఫ్యాన్స్ గర్వపడేలా ఈ సినిమా ఉందని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా వీరు హీరో ఇంట్రడక్షన్ సీన్ ని వీడియో తీసి వాట్స్ అప్ లో పెట్టారు. ఈ వీడియో 2 నిమిషాల నిడివితో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇప్పటికే 'కబాలి' పై వున్న అంచనాలు అమాంతం గా పెరిగిపోయాయి. సదరు ప్రేక్షకులకు టిక్కెట్స్ దొరకనంతగా ఈ సినిమా టికెట్స్ బుక్ అయ్యాయి అంటే 'కబాలి' పై ఎటువంటి అంచనాలు ఉన్నాయో అర్ధమవుతుంది.