Advertisementt

చైతూ నమ్మకాన్ని నిలబెడతాయా!

Fri 22nd Jul 2016 01:42 PM
naga chaitanya,sahasam swasaga sagipo,premam,gautham menen  చైతూ నమ్మకాన్ని నిలబెడతాయా!
చైతూ నమ్మకాన్ని నిలబెడతాయా!
Advertisement
Ads by CJ

'ఆటోనగర్‌సూర్య, ఒక లైలా కోసం, దోచెయ్‌' వంటి చిత్రాల ఫ్లాప్‌లతో హీరో నాగచైతన్య కొద్ది గ్యాప్‌ తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన రెండు విభిన్న చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండింటిపై చైతూ భారీ ఆశలే పెట్టుకొని ఉన్నాడు. అందులో గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో రూపొందిన 'సాహసం శ్వాసగా సాగిపో' ఒకటి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఆడియోకు మంచి స్పందనే లభిస్తోంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 19న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇక చైతూ నటిస్తోన్న మరో చిత్రం మలయాళ సూపర్‌హిట్‌ 'ప్రేమమ్‌'కి రీమేక్‌. కాగా ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. కాగా ఈ చిత్రాన్ని 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రానికి 20రోజుల గ్యాప్‌లోనే అంటే సెప్టెంబర్‌ 9న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. మొత్తానికి ఈ రెండు చిత్రాలపై అక్కినేని వారసునికి మంచి నమ్మకమే ఉంది. మరి ఈ రెండు చిత్రాలు ప్రేక్షకాదరణ కూడా పొంది చైతూ నమ్మకాన్ని నిలబెడతాయో లేదో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ