Advertisementt

పవన్ అంటే భయపడుతున్నారు..!

Fri 22nd Jul 2016 06:28 PM
pawan kalyan,dolly,johnny,sardaar gababr singh,script work  పవన్ అంటే భయపడుతున్నారు..!
పవన్ అంటే భయపడుతున్నారు..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ నటించబోయే తాజా చిత్రం విషయంలో గందరగోళం ఏర్పడింది. ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో నిర్మితం కావాల్సిన ఈ సినిమా జూలైలోనే సెట్స్‌పైకి వెళ్లుతుందని అందరూ భావించారు. కానీ దర్శకుడు సూర్య అకస్మాత్తుగా దర్శకత్వ బాధ్యతలు వదిలివేయడంతో దీనికి 'గోపాల..గోపాల' ఫేమ్‌ డాలీకి దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు. దీంతో ఈ స్క్రిప్ట్‌లో మరలా మార్పులు చేర్పులు చేయడంలో డాలీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఓ ఫ్యాక్షనిస్ట్‌కు, పల్లెటూరి అమ్మాయికి మద్య జరిగే ఓ అందమైన ప్రేమకథగా తెరకెక్కనుంది. కాగా ఈచిత్రాన్ని ఫ్యామిలీ సెంటిమెంట్‌ను, కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కలిపి అందించాలని డాలీ కృషిచేస్తున్నాడు. ఇటీవల ఖాళీగా ఉన్న పవన్‌ సైతం ఈ చిత్రం ప్రీపోడక్షన్‌ పనుల్లో పాలుపంచుకుంటున్నాడని సమాచారం. ఇప్పటికే పవన్‌ తన దర్శకత్వంలో వచ్చిన 'జానీ', తానే కథ, స్క్రీన్‌ప్లే అందించిన 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌'కు డిజాస్టర్స్‌గా నిలిచాయి. పవన్‌లో సినిమాకు సంబంధించిన ప్రతి శాఖపై పట్టు ఉందనేది వాస్తవమే అయినా.. ఆయన ఇలా స్క్రిప్ట్‌ మార్పులు, చేర్పుల్లో వేలుపెట్టడం నిర్మాత శరత్‌మరార్‌నే కాదు.. అభిమానులకు కూడా భయాందోళన కలిగిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ