రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రత్యేకహోదాపై ప్రైవేట్ బిల్లు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే చంపేసి... సంతాపసభ పెట్టినట్లు ఉందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకు పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు ఆమోదం పొందిన దాఖలాలు లేవని వారంటున్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే సభలను స్తంభింపజేయడం వల్ల మాత్రమే ప్రయోజనం ఉంటుందని వారు సూచిస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ బిల్లుకు తమ పార్టీ మద్దతునిస్తుందని వైసీపీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి సెలవిస్తున్నారు. అవకాశం ఉంటే లోక్‌సభలో కూడా ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు ఆయన అంటున్నారు. మొత్తానికి ప్రైవేట్ బిల్లు వల్ల ప్రయోజనం ఉండదని విశ్లేషకులు తేల్చేస్తున్నారు.