గత రెండు మూడు రోజులుగా సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్‌లు అందరిలో ఆసక్తిని పెంచాయి. మీకో సర్‌ప్రైజింగ్ న్యూస్ చెబుతానంటూ ఆయన ఊరిస్తున్నాడు. దీంతో చాలామంది ఆయన తన వివాహం గురించిన సంగతి చెబుతాడేమో అని ఆశపడ్డారు. కానీ అతని తండ్రి ఇటీవలే మరణించడం వల్ల అలాంటి న్యూస్ ఉండకపోవచ్చని, ఆయన దిల్‌రాజు నిర్మాతగా సుకుమార్ దర్శకత్వంలో హీరోగా నటించే చిత్రం గురించి ఏమైనా న్యూస్ చెబుతాడేమో అని మరికొందరు ఊహించారు. కానీ అది కూడా వాస్తవం కాదని తెలిసిపోయింది. చివరకు ఆయన చెప్పిందేమిటంటే.... జీ తెలుగు చానెల్‌లో తాను మ్యూజికల్ ప్రోగ్రామ్ చేయనున్నట్లు తెలిపాడు. పాపం.. ఆయనేదో సర్‌ప్రైజింగ్ న్యూస్ అంటే ఏమి చెబుతాడో? అని ఎదురుచూసిన వారికి ఈ విషయం పెద్దగా కిక్‌ను ఇవ్వలేదనే చెప్పాలి.