జనసేన నేతగా పవన్ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పై తీవ్రఆగ్రహం వ్యక్తం చేసి టిడిపి - బిజెపి కూటమికి తన మద్దతును తెలిపాడు. ఆయన మద్దతు ఈ కూటమి విజయంలో కీలక పాత్రను పోషించింది. అయితే తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలు, ఏపీలో చంద్రబాబుపై పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన పవన్ ఇప్పటికే టిడిపిని పక్కనపెట్టేశాడు. తాజాగా రాజ్యసభలో కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రత్యేకహోదా ప్రైవేట్ బిల్లుకు బిజెపి అడ్డుపడిన విధానం పవన్‌ను తీవ్రంగా భాదించాయని సమాచారం. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆయన బిజెపికి మద్దతునిచ్చే అవకాశం లేదని వినిపిస్తోంది. ఎవ్వరితో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగానే వచ్చేఎన్నికల్లో బరిలో దిగాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.