Advertisementt

అక్కడ ప్రశంసలు..ఇక్కడ పట్టించుకోరు!

Tue 26th Jul 2016 02:26 PM
sobhita dhulipala,raman raghav 2,kingfisher calendar,tollywood,bollywood  అక్కడ ప్రశంసలు..ఇక్కడ పట్టించుకోరు!
అక్కడ ప్రశంసలు..ఇక్కడ పట్టించుకోరు!
Advertisement
Ads by CJ

కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌ చూసిన శృంగార ప్రియులు, సినీ జనాలు ఆ క్యాలెండర్‌ పేజీలు తిరగేస్తూ ఉంటే వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దానికి కారణం ఆ క్యాలెండర్‌లో ఓ తెలుగమ్మాయి దర్శనమివ్వడమే. ఆ క్యాలెండర్‌లో ఓ తెలుగు అమ్మాయి బికినీ వేసి మధ్యలో తళుక్కున మెరిసింది. ఆమే....శోభిత ధూళిపాళ. కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌లో ఓ తెలుగు అమ్మాయి కనిపిస్తే ఇక మన తెలుగు హీరోలందరూ తమ పక్కన ఆమెను సినిమాల్లో బుక్‌ చేసుకుంటారని అందరూ అనుకున్నారు. దాంతో ఆమె తెలుగు సినిమాలల్లో బిజీ అయిపోతుందని అందరూ భావించారు. కానీ సీన్‌ రివర్స్‌ అయింది. ఆమెకు బాలీవుడ్‌ నుండి ఆఫర్లు వచ్చాయి కానీ తెలుగులో ఆమెను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇప్పటికే స్వాతి, శ్రీదివ్య, అంజలి వంటి తెలుగమ్మాయిలు తమిళనాట మంచి క్రేజ్‌ తెచ్చుకుంటూ ఉంటే.. మనవారు వారికి అవకాశం ఇవ్వకుండా తెల్లతోలునుచూసి బాలీవుడ్‌ నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకుంటున్నారు. రీసెంట్‌గా అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించిన 'రమణ్‌ రాఘవ్‌ 2.0'లో అద్బుతంగా నటించి అందరి ప్రశంసలు పొందుతోంది శోభిత. బాలీవుడ్‌ మీడియా ఆమెను ఆకాశానికి ఎత్తేశాయి. కానీ మనవారు మాత్రం అసలు ఆమెను పట్టించుకోకపోవడం బాధాకరం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ