Advertisementt

బాబు వచ్చాడు సరే..బంగారం ఎక్కడ..?

Tue 26th Jul 2016 05:52 PM
babu bangaram,venkatesh,nayanthara,nayanthara absent to babu bangaram audio,babu bangaram movie  బాబు వచ్చాడు సరే..బంగారం ఎక్కడ..?
బాబు వచ్చాడు సరే..బంగారం ఎక్కడ..?
Advertisement
Ads by CJ

ఒక సినిమాలో ఒక హీరోయిన్ నటిస్తుంది అంటే ఆమె ఆ సినిమాకి సంబంధించి అన్ని విషయాల్లో పాలు పంచుకోవాలి. హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలకు కూడా ఇదే వర్తిస్తుంది. టాలీవుడ్ హీరోలు తాము చేసిన ఏ సినిమాలకైనా ఆయా ఫంక్షన్స్ కి, సినిమాకి సంబంధించి అన్ని ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతూ వుంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఒక సినిమాకు మాకు ఇంత కావాలని డిమాండ్ చేసి మరీ తీసుకుంటారు. అయితే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం భాగస్వాములు కారు. వీరిలో నయనతార ముందు వరసలో ఉంటుంది. నయనతార ఎంత పెద్ద సినిమాలో నటించినా, ఎంత పెద్ద హీరోతో నటించినా కూడా ఆమె మాత్రం ఆ సినిమాకి సంబంధించి ఏ ఫంక్షన్ కి గాని, ప్రమోషన్ ఈవెంట్ కి గాని హాజరవ్వదు. అయినా కూడా టాలీవుడ్ నిర్మాతలు ఆమెను సినిమాలలో హీరోయిన్ గా సెలెక్ట్ చేస్తున్నారు. ఆమె తాజాగా జరిగిన 'బాబు బంగారం' ఆడియో వేడుకకి హాజరవ్వకుండా ఆ సినిమా యూనిట్ కి హ్యాండ్ ఇచ్చింది. అసలు ఇప్పటికే ఆమె 'బాబు బంగారం' టీమ్ కి సరిగా డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. మళ్ళీ ఇప్పుడు ఆడియో వేడుకకి కూడా దూరం గా వుంది. ఆడియో వేడుకలంటే తమ అభిమాన హీరోని, అలాగే హీరోయిన్ ని దగ్గరగా చూడొచ్చని అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. మరి అంత కష్టపడి ఆడియో వేడుకకు హాజరైతే అక్కడ తమ అభిమాన హీరోయిన్ కనబడకపోతే ఫాన్స్ హార్ట్ అవుతారు. 'బాబు బంగారం' ఆడియో లో కూడా అదే జరిగింది. ఆడియోకి హాజరవ్వకుండా హ్యాండ్ ఇచ్చిన నయన్ మీద వెంకటేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. నయనతార ఈ ఒక్క సినిమాకే కాదు తాను నటించిన ఇతర సినిమాల ఆడియో వేడుకలకు కూడా హ్యాండ్ ఇస్తూనే ఉంటుంది. అందుకే 'బాబు బంగారం' ఆడియో ని కూడా ఆమె లైట్ తీసుకుందని సెటైర్స్ వేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ