Advertisementt

మహేష్‌ బర్త్‌డే కి గిఫ్ట్‌ ప్లాన్ చేస్తున్నారు!

Tue 26th Jul 2016 06:22 PM
mahesh babu,murugadoss,august 9th,teaser,prince mahesh babu new look  మహేష్‌ బర్త్‌డే కి గిఫ్ట్‌ ప్లాన్ చేస్తున్నారు!
మహేష్‌ బర్త్‌డే కి గిఫ్ట్‌ ప్లాన్ చేస్తున్నారు!
Advertisement
Ads by CJ

ఈనెల 29 నుంచి సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, డైరెక్టర్‌ మురుగదాస్‌ల చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ఆగష్టు 1 నుంచి ఈ చిత్రం సెట్‌లోకి మహేష్‌ ఎంటర్‌ కానున్నాడు. ఇక ఆగష్టు 9వతేదీన మహేష్‌ బర్త్‌డే ఉంది. ఈ చిత్రంలో మహేష్‌ లుక్‌కి సంబంధించిన ఫొటోషూట్‌ కూడా ఎప్పుడో జరిగిపోయింది. దీంతో మహేష్‌ బర్త్‌డే కానుకగా ఈ చిత్రం ప్రీలుక్‌ వంటిది విడుదల చేస్తే ఎలా ఉంటుంది? అని డైరెక్టర్‌ మురుగదాస్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్‌ ఉన్న మహేష్‌, మురుగదాస్‌ల చిత్రం అనేసరికి ఈచిత్రం అనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఎక్కువ భాగాన్ని చెన్నై, ముంబై, హైదరాబాద్‌, ఢిల్లీలతో పాటు గుజరాత్‌, రాజస్దాన్‌ రాష్ట్రాలలో షూటింగ్‌ జరపనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా మహేష్ సరసన నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌శివన్‌, హరీస్‌ జైరాజ్‌ వంటి టెక్నీషియన్స్‌ వర్క్ చేస్తున్నారు.  ఎన్వీ ప్రసాద్‌తో కలిసి ఠాగూర్‌ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ