Advertisementt

చిరంజీవి 150 మూవీ టైటిల్ ఇదే..!

Wed 27th Jul 2016 06:15 PM
chiranjeevi,nepoliyan,150th movie,chiranjeevi 150th movie title,nepoliyan movie  చిరంజీవి 150 మూవీ టైటిల్ ఇదే..!
చిరంజీవి 150 మూవీ టైటిల్ ఇదే..!
Advertisement
Ads by CJ

చిరంజీవి 150 సినిమా.. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో, రామ చరణ్ నిర్మాతగా.. కొణిదెల ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తమిళ 'కత్తి' కి రీమేక్ గా తెరకెక్కుతున్న విషయము తెలిసిందే. అయితే ఈ సినిమాకి అంతా 'కత్తిలాంటోడు' అని టైటిల్ పెట్టారని అనుకున్నారు. కానీ రామ్ చరణ్ 'కత్తిలాంటోడు' కాదు టైటిల్ అని చెప్పడంతో ఫోకస్ అంతా 'ఖైదీ నెం 150' పై పడింది. ఈ టైటిల్ అయితే బావుంటుందని... రామ్ చరణ్ కి కూడా ఈ టైటిల్ నచ్చిందని ప్రచారం జరిగింది. కానీ ఆ టైటిల్ కూడా ఫైనల్ కాలేదు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా కి టైటిల్ సెట్ అయింది. ఈ మూవీ అంతా రైతుల చుట్టూ... వారి సమస్యల చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మంచి టైటిల్ పెట్టాలని ఆలోచించిన యూనిట్ ఈ మూవీ కోసం 'నెపోలియన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది.  పోరాటం అతని నైజం అనే టాగ్ లైన్ తో సోషల్ మీడియా లో ఒక పోస్టర్ రివీలైంది. మరి ఈ సినిమాకి ఈ టైటిల్ చక్కగా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తుందని సమాచారం. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా హీరోయిన్ ని ఫైనల్ చేసేందుకు యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ