సాధారణంగా అగ్రవర్ణాలు దళితులను తక్కువగా చూస్తాయనే భ్రమ చాలామందిలో ఉంది.ఈ దళిత ఉద్యమనేతలు, నాయకులు, కొందరు కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని తమ స్వలాభం కోసం, తమ ప్రత్యర్దుల ఆటకట్టించడం కోసం తప్పుదోవ పట్టిస్తున్నాయనే భావన కూడా చాలా మందిలో ఉంది. ఇందులో వాస్తవం కూడా ఉంది. అంబేద్కర్ పేరును, దళిత, బడుగు, బలహీన వర్గాలనే నెపంతో కొందరు తమ స్వార్దంతో సమాజాన్ని భ్రష్థు పట్టిస్తున్నారు. ఇక ఎన్నికల ముందు వరకు వైయస్సార్‌సీపీలో కీలకపాత్ర పోషించిన మాలనేత జూపూడి ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతోనే ఆ పార్టీలోకి జంప్ చేశాడు.
అంతేకాదు..సామాన్యంగా ఎవ్వరి మాటను పట్టించుకోని చంద్రబాబును ఎలాగో లొంగదీసుకొని, మాటలు చెప్పి క్యాబినెట్ హోదా ర్యాంకు వంటి ఎస్సీ కార్పొరేషన్‌కు ఛైర్మన్ పదవిని చేపట్టారు. కానీ ఇక్కడే అసలు చిక్కుముడి వచ్చిపడింది. దళితులైన మాలలు, మాదిగలకు ఒకరంటే ఒకరికి అసలు పడదు. వారిలో వారికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. దీంతో మాల సామాజిక వర్గానికి చెందిన జూపూడి తన సహచరులకు, తనతోటి మాలలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నాడంటూ మాదిగ దండోరా నాయకులు మండిపడుతున్నారు. మాలల కన్నా మాదిగలు అన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నారని, అందుకే తాము ఎప్పటినుంచో ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్నామని చెబుతున్న మాదిగలు ఇప్పుడు కార్పొరేషన్ రుణాలు, ఇతర సహాయాలు కేవలం జూపూడి తన వర్గీయులకే చేస్తున్నాడంటూ.. త్వరలో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.