Advertisementt

ఆమె పతనానికి కారణం ప్రేమే! కానీ..?

Fri 29th Jul 2016 02:48 PM
mamta kulkarni,vicky goswami,love affair,yoga,drugs mafia  ఆమె పతనానికి కారణం ప్రేమే! కానీ..?
ఆమె పతనానికి కారణం ప్రేమే! కానీ..?
Advertisement
Ads by CJ

ఒకప్పుడు బాలీవుడ్ లో టాప్ 2 హీరోయిన్ గా  వున్న మమతా కులకర్ణి ప్రస్తుతం నైరోబి దేశం లో యోగా, ధ్యానం చేసుకొంటూ గడిపేస్తుందట. బాలీవుడ్ లో 'కరణ్ అర్జున్, ఆషిక్ ఆవారా' వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించిన మమతా.. ఆ తర్వాత పెద్దగా సినిమాలలో కనిపించలేదు. అదేమిటి ఎందుకిలా అయ్యింది అనుకుంటున్నారా... అదేనండి ప్రేమలో పడితే మనిషి ప్రపంచాన్ని మర్చిపోతాడు. మమతా కులకర్ణి విషయం లో కూడా అదే జరిగింది. ఆమె పతనానికి కారణం ప్రేమే అంట. కెరీర్ మంచి ఊపుమీదున్నప్పుడు ప్రేమ, దోమ అంటూ డ్రగ్ మాఫియా డాన్ విక్కీ గోస్వామితో సినిమాలు వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయింది. అయితే ఆమె అక్కడ తన లవర్ తో సహజీవనం చేస్తుంది అని అనుకుంటున్నారు అంతా. కానీ ఆమె తన లవర్ తో కలిసి ఉండడం లేదని... అతను తనని మోసం చేసాడని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. అంతే కాకుండా అతను చేస్తున్న డ్రగ్స్ మాఫియాతో తనకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పుకొచ్చింది. తనకి ప్రపంచాన్ని చూపిస్తానని తీసుకొచ్చి తన మానాన తనని వదిలేశాడని చెప్పుకొచ్చింది. నేను ఒంటరిగా ఒక అపార్టుమెంటు లో యోగా, ధ్యానం తో కాలం గడుపుతున్నానని చెప్పింది. అయితే ఇటీవల ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ లో నిందితురాలిగా ఆమె వార్తల్లోకెక్కింది. మరి ఇలాంటి సమయం లో మమతా నాకు ఏ పాపం తెలీదంటే ఎవరన్నా నమ్ముతారా...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ