మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రంగా చేస్తున్న తమిళ 'కత్తి' రీమేక్‌కి సంబంధించి టైటిల్ విషయంలో ఇంకా కన్ఫూజన్ కొనసాగుతూనే ఉంది. మొదట ఈ సినిమాకి 'కత్తిలాంటోడు' అనుకున్నారు. నిర్మాత రామ్‌చరణ్ ఆ టైటిల్ కాదు అని చెప్పడంతో..'కత్తిలాంటోడు' గురించి డిస్కషన్స్ ఆగిపోయాయి. ఆ తర్వాత ఈ సినిమాలో చిరంజీవి ఖైదీగా కనిపించే షర్ట్‌పై ఉన్న నెంబర్ చూసి 'ఖైదీ నెం 150' అనే టైటిల్ పెట్టాలని, రామ్‌చరణ్ కూడా 'ఖైదీ' అనే సెంటిమెంట్ తన తండ్రికి బాగా కలిసి వచ్చిందని..ఈ టైటిల్ పెడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో 'నెపోలియన్' అనే టైటిల్‌తో చిరంజీవి 150కి సంబంధించి ఓ పోస్టర్ హల్‌చల్ చేసింది. 'కత్తి' కథకి ఈ టైటిల్ యాఫ్ట్ అనే విధంగా టైటిల్ డిజైన్ ఉండటంతో..ఇదే చిరు 150వ సినిమా టైటిల్ అనుకున్నారు. అయితే అది ఫ్యాన్స్ క్రియేట్ చేసిన టైటిల్‌గా తర్వాత తెలిసిపోయింది. ఫ్యాన్స్ క్రియేట్ చేసిందే అయినా.. ఆ టైటిల్ విషయంలో మెగాభిమానులందరూ అదే టైటిల్ అయితే బావుండు అనుకున్నారు. కానీ ఆ ఛాన్స్ ఇప్పుడు లేదు. మెగా 150కి 'నెపోలియన్' అనే టైటిల్ పెట్టుకోవడానికి వీలు లేకుండా అదే పేరుతో ఓ మూవీ అనౌన్స్ అయ్యింది. నారా రోహిత్ 'ప్రతినిధి' చిత్రానికి కథను అందించిన ఆనంద్ రవి దర్శకత్వంలో ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ టైటిల్ రిజిష్టర్ అయ్యింది. దీనికి సంబంధించి ఓ పోస్టర్ కూడా అఫీషియల్‌గా బయటికి వచ్చింది. సో..'నెపోలియన్'గా చిరు కి ఇక ఛాన్స్ లేనట్లే. దీంతో మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్ర టైటిల్ వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది.