Advertisementt

హాలీడే ట్రిప్పా లేక చైతూ పార్టీనా..!!

Sat 30th Jul 2016 08:11 AM
holiday trip,heroes and heroines,naga chaitanya bachelor party,naga chaitanya marriage  హాలీడే ట్రిప్పా లేక చైతూ పార్టీనా..!!
హాలీడే ట్రిప్పా లేక చైతూ పార్టీనా..!!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ కొంతమంది యూరప్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం సోషల్ మీడియా లో వారు పోస్ట్ చేస్తున్న పిక్స్ బట్టి అర్ధమవుతున్నది. మరి వారు నిజం గానే హాలీడే ట్రిప్ లో ఉన్నారా లేక మరేదైనా ఉందా అనేది మాత్రం తెలీదు. కానీ దీనికి సంబంధించి ఒక న్యూస్ మాత్రం ప్రచారం జరుగుతుంది. నాగ చైతన్య - సమంతలు ఒకరినొకరు లవ్ చేసుకున్నారనే విషయం అందరికి తెలిసిందే. అయితే వీళ్ళ పెళ్ళికి అక్కినేని ఫ్యామిలి కూడా ఒప్పుకుందని త్వరలోనే వీళ్ళ పెళ్లి జరగబోతుందని సమాచారం. అయితే పెళ్లి సెటిల్ అయినందుకు గాను నాగ చైతన్య ఒక పార్టీ ఎరేంజ్ చేసాడని... ఆ పార్టీ ని యూరప్ లో ఇస్తున్నాడని... అందుకే టాలీవుడ్ సెలబ్రిటీస్ కొంతమంది యూరప్ వెళ్లారని ఒక న్యూస్ టాలీవుడ్ లో చెక్కర్లు కొడుతోంది. ఈ ట్రిప్ లో నాగ చైతన్యతో పాటు రానా, రవి తేజ, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, సమంత కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన కూడా వెళ్లారు. వీరు అంతా రక రకాల ఫోజులతో పిక్స్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. మరి నిజం గా వీరు హాలీడే ట్రిప్ కి వెళ్ళారా లేక నాగ చైతన్య ఇచ్చే బ్యాచిలర్ పార్టీ కి అటెండ్ అయ్యారా అనేది తెలియాల్సి వుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ