Advertisementt

పవన్‌కల్యాణ్ ఎలా వచ్చాడు..? బాసూ..!

Sat 30th Jul 2016 08:13 AM
pawan kalyan,mirchi music awards,hemanth,chiyan vikram,power star  పవన్‌కల్యాణ్ ఎలా వచ్చాడు..? బాసూ..!
పవన్‌కల్యాణ్ ఎలా వచ్చాడు..? బాసూ..!
Advertisement
Ads by CJ

సాధారణంగా అవార్డుల వేడుకలకు కథానాయకుడు పవన్‌కల్యాణ్ దూరంగా వుంటాడు. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈ విషయంలో మరీ పర్టిక్యులర్‌గా వుంటున్నాడు పవన్. ఇటీవల జరిగిన సైమా, ఐఫా, ఫిలింఫేర్, మాటీవీ ఇలా ఏ అవార్డు వేడుకకు హాజరుకానీ పవన్ ఈ నెల 24న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన సౌత్ ఇండియా మిర్చి మ్యూజిక్ అవార్డుల వేడుకకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు తారలు, గాయనీ గాయకులు, సంగీత దర్శకుడు ఈ వేడుకకు హాజరయ్యారు. వీళ్లంతా పవన్‌కళ్యాణ్‌ను చూసి ఆశ్చర్య చకితులయ్యారట. ఈ వేడుకకు హాజరైన చియాన్ విక్రమ్ కూడా ఈ వేడుకలో పవన్‌ను చూసి థ్రిల్ ఫీలయ్యాడట. అయితే ఇటీవల జరిగిన ఇతర అవార్డుల నిర్వాహకులకు ఇది మింగుడుపడటం లేదట. అసలు మిర్చి అవార్డుల వేడుకకు పవన్ కళ్యాణ్ రావటమేమిటి బాసూ... అంటూ చర్చించుకుంటున్నారు. అయితే పవన్‌కల్యాణ్ రావడం వెనుక రేడియో మిర్చి ఆర్‌జే.. నటుడు హేమంత్ మంచితనం.. పవన్‌ను ఆయన ఒప్పించిన విధానం దోహదం చేశాయని అంటున్నారు టాలీవుడ్ జనాలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ