నాని ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి ఇండస్ట్రీ లో హీరో గా సెటిల్ అయ్యాడు. మొదటి సినిమా 'అష్టా చెమ్మా'తో హిట్ కొట్టి హీరో గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన 'ఈగ' సినిమాతో తన రెమ్యునరేషన్ ని ఏకం గా 2 నుండి 3 కోట్లకు పెంచేశాడు నాని. అయితే కొన్ని రాంగ్ డెసిషన్స్ తో మాస్ కథలు చేసి ప్లాప్ బాట పట్టాడు. ఇక నాని సినిమాలు వరసగా ప్లాప్ అవుతున్న తరుణం లో అతని రేటు భారీగా పడిపోయింది. నాని కూడా పెద్దగా డిమాండ్ చేయలేని పరిస్థితికి చేరుకున్నాడు. అలాంటి సమయంలో డైరెక్టర్ మారుతీ - నాని కాంబినేషన్లో వచ్చిన 'భలే భలే మగాడివోయ్' సినిమా నాని ని నేచురల్ స్టార్ ని చేసేసింది. ఇక ఈ సినిమాతో నాని వెనుదిరిగి చూసుకోకుండా ఆ తర్వాత వచ్చిన 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, జెంటిల్మెన్' సినిమాలతో నాని ఇమేజ్ అమాంతగా పెరిగిపోయింది. ఇక ఈ దెబ్బతో తన రెమ్యునరేషన్ బాగా పెంచేసాడు నాని. ఇప్పుడు ఏకం గా ఒక సినిమా చెయ్యడానికి 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. అయితే ఇంత భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన నాని మాత్రం ఇండస్ట్రీ లో తనకు బాగా డిమాండ్ వుంది కాబట్టే నాకు ఇంత మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీ అయ్యారని చెబుతున్నాడట.