మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఎంతో మందిని అప్రోచ్ అయ్యారని... ఏ హీరోయిన్ సెట్ అవ్వలేదని అనుకున్నారు. మహేష్ సరసన అలనాటి తార శ్రీదేవి కూతురు జాహ్నవి అయితే బావుంటుందని డైరెక్టర్ మురుగదాస్ అనుకున్నాడట. ఎలాగూ శ్రీదేవి తన కూతుర్ని హీరోయిన్ ని చేయాలని ప్రయత్నిస్తుంది కాబట్టి తన సినిమాతో తెరంగేట్రం చేయించాలని మురుగదాస్ భావించాడని టాక్. అయితే ఈ విషయమై మురుగదాస్.. శ్రీదేవి కూతురు జాహ్నవిని అడగగా ఆమె మాత్రం నేను ఇంకా సినిమాల్లో నటించడానికి సిద్ధంగా లేనని... ఇంకా నేను యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్నానని అది ఇంకా పూర్తి అవ్వలేదని చెప్పిందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. జాహ్నవి లాస్ ఏంజెల్స్ లోని యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక జాహ్నవి ఎలాగూ ఒప్పుకోలేదు కాబట్టి మహేష్ కోసం మురుగదాస్.. పరిణితి చోప్రాను అప్రోచ్ అయినట్లు... ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ అడగడం తో ఆమెను పక్కన పెట్టేసి మళ్ళీ టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన రకుల్ ని మహేష్ కి జోడిగా కన్ఫర్మ్ చేశారని సమాచారం.