Advertisementt

చిరంజీవి..ఇది కరెక్ట్ కాదేమో..!

Mon 01st Aug 2016 06:43 PM
chiranjeevi,thikka audio launch,srirastu subhamastu pre release function sai dharam tej,allu sirish  చిరంజీవి..ఇది కరెక్ట్ కాదేమో..!
చిరంజీవి..ఇది కరెక్ట్ కాదేమో..!
Advertisement
Ads by CJ

అల్లు శిరీష్ 'గౌరవం, కొత్తజంట' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఆ సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 'శ్రీరస్తు శుభమస్తు' అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్.. నిన్న (31/07/16) చిరంజీవి ముఖ్య అతిధిగా జెఆర్సీ లో జరిగింది. ఈ ఫంక్షన్ లో చిరంజీవి అల్లు శిరీష్ గురించి మాట్లాడుతూ..  అల్లు శిరీష్ ఇప్పుడు పూర్తి స్థాయిలో హీరో అయ్యాడని.... గత సినిమాలతో నటనలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాడని అన్నారు. తన కెరీర్ ని శిరీష్ చక్కగా మలుచుకుంటున్నాడని అన్నారు. ఇక ఈ సినిమా కంపల్సరీ హిట్ అవుతుందనే నమ్మకం తనకుందని అన్నారు.  గీతా ఆర్ట్స్ నిర్మాణం లో వచ్చే ఈ సినిమా కుటుంబ  విలువలు చాటి చెబుతుందని అన్నారు. ఇదంతా బాగానే వుంది.. అసలు విషయమేమిటంటే చిరంజీవి మాత్రం తన చెల్లెలి కొడుకు సాయి ధరమ్ 'తిక్క' ఆడియో ఫంక్షన్ కి హాజరవకుండా.. తన భార్య అన్న కొడుకు అల్లు శిరీష్ ఫంక్షన్ కి హాజరవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సాయి ధరమ్ తేజ్ నటించిన 'తిక్క' ఆడియో వేడుక శనివారం జరిగింది. అయితే ఈ వేడుకకి చిరంజీవి హాజరవలేదు. కనీసం విశేష్ కూడా చెప్పలేదు. మరి ఆదివారం అల్లు శిరీష్ నటించిన 'శ్రీరస్తు శుభమస్తు' ప్రీ రిలీజ్ వేడుకకు చిరు హాజరవ్వడం చూస్తుంటే.. మెగా, అల్లు ఫ్యామిలీలలో ఏదో జరుగుతుంది అనే డౌట్ ఇప్పుడు అందరికి కలుగుతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ