Advertisementt

ఒక్క సినిమాతో రకుల్ కి 2 కోర్కెలు తీరాయ్!

Mon 01st Aug 2016 09:13 PM
rakul preet singh,mahesh babu and murugadoss movie,parineethi chopra,rakul preet singh movies  ఒక్క సినిమాతో రకుల్ కి 2 కోర్కెలు తీరాయ్!
ఒక్క సినిమాతో రకుల్ కి 2 కోర్కెలు తీరాయ్!
Advertisement
Ads by CJ

హిట్ లతో, ప్లాప్ లతో సంబంధం లేకుండా తన కెరీర్ ని మలుచుకుంటున్న టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ లోని అగ్ర హీరోలందరితో నటించింది. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు తో మాత్రం ఒకసారి నటించే అవకాశం వచ్చినట్లే  వచ్చి చేజారిపోయింది. మళ్ళీ అలానే అవుతుందనుకున్న టైం లో అదృష్టం ఆమెని వరించి.. మురుగదాస్ - మహేష్ కాంబినేషన్ తెరకెక్కుతున్న సినిమాలో రకుల్, మహేష్ కి జోడిగా సెలెక్ట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో మొదట పరిణీతి చోప్రాని తీసుకున్నట్లు వార్తలొచ్చినా ఆమె వేరే కారణాలతో ఈ సినిమా ఛాన్స్ వదులుకుంది. వెంటనే ఆ ఛాన్స్ రకుల్ కి వచ్చేసింది. ఇక ఈ సినిమాలో రకుల్ ఫైనల్ అయ్యిందని అన్నారు కానీ ఈ విషయమై రకుల్ మాత్రం ఇప్పటివరకు ఏమి మాట్లాడలేదు. అయితే ఈ సినిమా షూటింగ్  రెండు రోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 

తాజాగా రకుల్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. నాకు మహేష్ పక్కన నటించేందుకు ఈ సారైనా అవకాశం వస్తే బావుండునని అనుకున్నానని.. కానీ ఈ సినిమాకి పరిణీతిని తీసుకుంటున్నారని వచ్చిన వార్తలతో కొంచెం అప్సెట్ అయ్యానని... కానీ అనూహ్యంగా  నన్ను సెలెక్ట్ చెయ్యడం చాలా సంతోషం గా అనిపించిందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాకి నన్ను అడిగినప్పుడు నేను కాశ్మీర్ లో వున్నానని... ఈ సినిమాలో నిన్ను సెలెక్ట్ చేశారని చెప్పగానే ఎగిరి గంతేశానని చెప్పుకొచ్చింది. అసలు నేను కథ కూడా వినకుండా ఈ సినిమా ఒప్పుకున్నాని చెప్పింది. ఎప్పటి నుండో మహేష్ పక్కన నటించాలని ఉందని... అంతే కాకుండా మురుగదాస్ వంటి గొప్ప డైరెక్టర్ దగ్గర పని చెయ్యాలని ఉండేదని చెప్పింది. అయితే ఇలా రెండు కోరికలు ఒకేసారి తీరడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది రకుల్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ