Advertisementt

'తిక్క' ఆడియోకి ఆ హీరోయిన్ ఎందుకొచ్చింది?

Tue 02nd Aug 2016 02:46 PM
thikka movie audio launch,poonam bajwa,sunil reddy,poonam bajwa weds sunil reddy  'తిక్క' ఆడియోకి ఆ హీరోయిన్ ఎందుకొచ్చింది?
'తిక్క' ఆడియోకి ఆ హీరోయిన్ ఎందుకొచ్చింది?
Advertisement
Ads by CJ

సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న 'తిక్క' సినిమా ఆడియో శనివారం(30/07/16) న శిల్పకళా వేదికలో జరిగింది.  ఈ ఆడియో ఫంక్షన్ కి ఎంతోమంది హీరోయిన్స్ హాజరయ్యారు. అసలు ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్సే కాకుండా ఇంకా బయటినుంచి కొంతమంది హీరోయిన్స్ కూడా వచ్చారు. వారిలో ఒక హీరోయిన్ మాత్రం ఈ సినిమాకి సంబంధించి గాని, హీరోకి సంబంధించి గాని ఏ విధమైన సంబంధం లేకుండా హాజరైంది. మరి ఆమె ఎవరికోసం ఈ ఆడియో వేదికని పంచుకుందనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆమె ఎవరో కాదు తెలుగులో అడపా దడపా నటించి మంచి పేరు రాక టాలీవుడ్ నుండి తమిళ్ కి అక్కడి నుండి మలయాళానికి చెక్కేసిన పూనమ్ బజ్వా. అయితే ఆమె 'తిక్క' ఆడియో కి హాజరవ్వడానికి కారణం మాత్రం తిక్క సినిమాని డైరెక్ట్ చేసిన సునీల్ అంట. సునీల్ కి ఈమె కి ఏమిటి పరిచయం అనుకుంటున్నారా.... అదేనండి పూనమ్, 'తిక్క' డైరెక్టర్ సునీల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారట. అందుకే ఈ ఆడియోకి పూనమ్ ని, ఆమె తల్లి, తండ్రులను ఆహ్వానించినట్లు సమాచారం. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత వీరిద్దరూ పెళ్లి పీటలెక్కుతున్నారని సమాచారం. సో.. కేవలం 'తిక్క' డైరెక్టర్ తో వున్న సన్నిహిత సంబంధాల వల్లే ఆమె ఈ ఆడియోకి హాజరైందన్నమాట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ