హీరోయిన్ అమలాపాల్ కేవలం సినిమాల్లో నటించేందుకే తన భర్తకి విడాకులిచ్చిందనేది ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే. అయితే తనని తన అత్తమామలు వేధించేవారని... పెళ్లి తర్వాత సినిమాలలో నటించేందుకు ముందు ఒప్పుకుని ఇప్పుడు మాత్రం అది కుదరదని చెబుతున్నారని అమలాపాల్ చెబుతుంది. పెళ్లి తర్వాత నేను నటిస్తాను అంటే తన భర్త విజయ్ కూడా ఒప్పుకున్నాడని... పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుంటే విజయ్ తల్లి తండ్రులు వద్దన్నారని.. తన తల్లి తండ్రులకు సర్ది చెప్పలేక విజయ్ చాలా మదనపడేవాడని చెప్పుకొచ్చింది. కానీ అమలాపాల్ మామ మాత్రం మేము అమలాని ఏమి అనలేదని సినిమాలలో నటించడం ఆపేసి బుద్దిగా గృహిణిలా ఉండమన్నామని... అది అమలపాల్ కి నచ్చలేదని అందుకే ఈ డివోర్స్ అని చెప్పాడు. కెరీర్ మంచి పొజిషన్ లో వున్నప్పుడు పెళ్లి చేసుకోవడం ఒక తప్పు. ఇప్పుడేమో నేను సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తా అనడం కూడా సరికాదు. అవన్నీ పెళ్ళికి ముందే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కదా అమలా అంటున్నారు కోలీవుడ్ పెద్దలు. ఈ విషయంలో ఎవరి వాదన వారు వినిపిస్తున్నా.. అమలాపాల్ చేజేతులా తన కాపురాన్ని నాశనం చేసుకుందని మాత్రం చెప్పకుండా ఉండలేం.