Advertisementt

మనోజ్ నిర్మాత పై జూ. ఆర్టిస్టుల దాడి!

Wed 03rd Aug 2016 12:07 AM
manchu manoj,achi reddy,jr artist,s.n.reddy,new movie,cheating,police station,producer council  మనోజ్ నిర్మాత పై జూ. ఆర్టిస్టుల దాడి!
మనోజ్ నిర్మాత పై జూ. ఆర్టిస్టుల దాడి!
Advertisement
Ads by CJ

మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాకి అచ్చి బాబు, ఎస్.ఎన్ రెడ్డి లు  నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. అక్కడ షూటింగ్ జరుగుతుండగా జూనియర్ ఆర్టిస్ట్ లు కొంతమంది అక్కడికి వచ్చి గొడవపెట్టుకున్నారు. వీరిలో కొంతమంది అక్కడున్న నిర్మాత అచ్చి బాబుపై చెయ్యి చేసుకున్నారని సమాచారం. అయితే ఈ హాఠాత్ పరిణామానికి షాక్ అయిన నిర్మాత అచ్చి బాబు, మరో నిర్మాత ఎస్.ఎన్.రెడ్డి  వీరిపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఇక అక్కడున్న జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా నిర్మాతలపై కంప్లైంట్ చేశారు. ఇంతకీ అసల విషయం ఏమిటంటే జూనియర్ ఆర్టిస్ట్ లకు నిర్మాతలు అచ్చి బాబు, ఎస్ ఎన్ రెడ్డి లు 15 లక్షలు ఇస్తానని చెప్పి కేవలం 5 లక్షలు ఇచ్చారని మిగతా డబ్బులు ఇవ్వమంటే మేము గొడవ పెట్టామని చెబుతున్నారని జూనియర్ ఆర్టిస్ట్ లు చెబుతున్నారు. కానీ నిర్మాతల వాదన మరోలా వుంది ఫిలిం ఛాంబర్ లో నిబంధనల ప్రకారమే నమోదు చేసుకున్న ఆర్టిస్టులకు మాత్రమే అవకాశం ఇవ్వడం వల్ల... వేరే వారు తమకు అవకాశం కావాలని అడగడం తో... తాము కుదరదని చెప్పడం తో వారు గొడవచేశారని అంటున్నారు. ఇక ఇదంతా చూస్తున్న హీరో మంచు మనోజ్ మాత్రం ఏదన్నా ఉంటే ఫిలిం ఛాంబర్ లో తేల్చుకోవాలని గాని ఇలా నిర్మాతల మీద చెయ్యిచేసుకోవడం ఏమిటి అని ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేశారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ