Advertisementt

ఇక్కడ ఆంటీలు..అక్కడ హీరోయిన్లు..!

Thu 04th Aug 2016 03:22 PM
aunties,heroines,bollywood heroines,marriage after heroines,sneha,aishwarya rai  ఇక్కడ ఆంటీలు..అక్కడ హీరోయిన్లు..!
ఇక్కడ ఆంటీలు..అక్కడ హీరోయిన్లు..!
Advertisement
Ads by CJ

తెలుగులో హీరోయిన్ గా చేసిన సినిమాలో మంచి గుర్తింపు రాక ఎదో చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఉండే స్నేహ.. తమిళ నటుడు ప్రసన్న ని పెళ్లి చేసుకుని ఇక సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేస్తుంది అనుకున్నారు అందరూ. కానీ స్నేహ మాత్రం పెళ్ళైన తర్వాత కూడా చిన్న చితక సినిమాలలో కనబడుతూనే వుంది. ఆల్రెడీ స్నేహ కి ఒక కొడుకు కూడా వున్నాడు. అయితే పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న హీరోయిన్స్ కి మాత్రం దక్షిణాదిన పెద్దగా డిమాండ్ లేదు. అందుకే స్నేహ కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయింది. ఆ మధ్య తెలుగులో వచ్చిన 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలో ఉపేంద్ర భార్యగా చిన్న పాత్రలో నటించింది. ఇక ఏ పాత్ర అయినా తాను నటించడానికి సిద్ధమని స్నేహ తన సన్నిహితులకు చెబుతుందట. పెళ్ళై బాబు వున్న తనకి ఇంకా హీరోయిన్ గా  ఛాన్సులు రావని స్నేహ ఫిక్స్ అయినట్టుంది. అందుకే ఏ కేరెక్టర్ చేయడానికైనా సిద్ధమని చెబుతోందని అనుకుంటున్నారు. అదే బాలీవుడ్ లో అయితే పెళ్లి అయినా... వాళ్ళు మాత్రం హీరోయిన్ గానే చెలామణి అవుతున్నారు. వీరిలో మచ్చుకు ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్, రాణి ముఖర్జీలు వున్నారు. వీరికి ఏకంగా పిల్లలున్నా కూడా వీరు హీరోయిన్స్ గానే హవా కొనసాగిస్తున్నారు. కానీ మన దక్షిణాది హీరోయిన్స్ కి మాత్రం ఆ ఛాన్స్ లేదు. పెళ్ళైతే చాలు ఆంటీ లు అనేస్తారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ