Advertisementt

'మహానటి' ఆమె కాదు..!!

Thu 04th Aug 2016 06:46 PM
mahanati,savitri,vidya balan,mahanati savitri movie  'మహానటి' ఆమె కాదు..!!
'మహానటి' ఆమె కాదు..!!
Advertisement
Ads by CJ

మహానటి సావిత్రి జీవిత కథతో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తానని దర్శకుడు నాగ్ అశ్విన్ ఆమధ్య చెప్పాడు.  అయితే సావిత్రి పాత్రకోసం బాలీవుడ్ లో ప్రత్యేక పాత్రలకు పెట్టింది పేరు అయిన విద్యాబాలన్ ని సంప్రదించినట్టు వార్తలొచ్చాయి. అయితే విద్యాబాలన్ 'డర్టీ పిక్చర్' వంటి వల్గర్ సినిమాలో నటించింది కాబట్టి ఆమె సావిత్రి పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తుందని ఆమెను సెలెక్ట్ చేశారని అనుకుంటున్నారు సినీఇండస్ట్రీ లోని ప్రముఖులు. అసలు సావిత్రి పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ఎందుకు మన తెలుగులో చాలామందే ఉన్నారుగా... వారిలో ఎవరినైనా తీసుకోవచ్చుగా అని అంటున్నారు. ఎవరేమనుకున్నా సావిత్రి జీవిత కథలో విద్యాబాలన్ నటిస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లకు స్పందిస్తూ నాగ అశ్విన్... అసలీ వార్తల్లో నిజం ఏమాత్రం లేదని అంటున్నాడు. అసలు నేను సావిత్రి కేరెక్టర్ కోసం విద్యాబాలన్ ని సంప్రదించలేదని స్పష్టం చేసాడు. అసలింకా ఈ పాత్రలో నటించడానికి ఏ హీరోయిన్ ని సంప్రదించలేదని... అసలు స్కిప్ట్ పూర్తి చేయని ఈ సినిమాకి విద్యని ఎలా సంప్రదించగలనని అంటున్నాడు. అయితే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాక హీరోయిన్ గురించి ఆలోచిస్తానని కుండబద్దలు కొట్టాడు. అలాగే హీరోయిన్ ఎంపికలో పెద్దల సలహా తీసుకునే చేస్తానని చెప్పాడు. అంతే కాకుండా ఈ సినిమా టైటిల్ కూడా 'మహానటి' అనే పేరుతోనే ఉంటుందని స్పష్టం చేసాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ