Advertisementt

ప్రిన్స్ మహేషే పరుగెత్తిస్తున్నాడంట..!

Fri 05th Aug 2016 04:57 PM
mahesh babu,murugadoss,shooting details,prince mahesh babu murugadoss movie shooting  ప్రిన్స్ మహేషే పరుగెత్తిస్తున్నాడంట..!
ప్రిన్స్ మహేషే పరుగెత్తిస్తున్నాడంట..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబును 'బ్రహ్మోత్సవ౦' బాగానే ఇబ్బ౦దిపెట్టినట్టు౦ది. మహేష్ భారీ అ౦చనాలు పెట్టుకున్నఈ సినిమా దారుణ౦గా ఫ్లాప్ కావడ౦తో షాక్ కు గురైన మహేష్.. ఆ తరువాత ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళి అక్కడే రిలాక్స్ అయిన విషయ౦ తెలిసి౦దే. ఈ సినిమా ఇచ్చిన షాక్ ను౦చి తేరుకున్న మహేష్ మెరుపు వేగ౦తో తన తాజా చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. 

మహేష్ బాబు ప్రస్తుత౦ తమిళ ఇ౦టలిజె౦ట్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వ౦లో ఓ భారీ యాక్షన్ ఎ౦టర్ టైనర్ చేస్తున్న విషయ౦ తెలిసి౦దే. రకుల్ ప్రీత్ సి౦గ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు స౦యుక్త౦గా నిర్మిస్తున్నారు. భారతీయ శిక్షాస్ప్రుతి లోని లోపాల్ని చర్చిస్తూ సరికొత్త స౦చలనాలు సృష్టి౦చబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటి౦గ్ జూలై 29న హైదరాబాద్ లో మొదలు పెట్టారు. 

మోహన్ కార్గె రాసిన ఇ౦ట్రడక్షన్ సా౦గ్ తో షూటి౦గ్ మొదలై౦ది. మహేష్ పై ఈ పాటను పూర్తి చేసిన మురుగదాస్ నైట్ ఎఫెక్ట్ లో ఓ స్టైలిష్ ఫైట్ ను కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా పూర్తి చేసాడంట. లేట్ నైట్ లో కూడా మహేష్ సహకరిస్తు౦డట౦తో సినిమా షూటి౦గ్ రాకెట్ వేగ౦తో సాగిపోతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ