ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణ పుష్కరాలకోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది. గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన అపశృతులు, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అనేక దేవాలయాల ఈవోలను, సిబ్బందిని విజయవాడకు వచ్చి ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతోపాటు వివిధ జిల్లాల ఎస్పీలను. ఇతరశాఖల్లోని అధికారులను కూడా పుష్కరాలు ముగిసే వరకు విజయవాడలోనే ఉండేలా నిర్ణయం తీసుకుని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు లేక అన్నిశాఖలలో పాలన స్తంభించింది. ఇక దేవాలయాల ఉద్యోగులను, సిబ్బందిని, ఈవోలను కృష్ణపుష్కరాలకు వేయడంతో దేవాలయాల్లో పెత్తనం మొత్తం ఇక పూజారులదే అయింది. శ్రావణమాసంలో సహజంగా భక్తులతో అమ్మవాళ్ల ఆలయాలు కిటకిటలాడుతుంటాయి. దీంతో వారికి సరైన సౌకర్యాలు కల్పించడం గగనంగా మారుతోంది. దీంతో రాష్ట్రంలోని భక్తులకు కృష్ణపుష్కరాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.