Advertisementt

నిలబెట్టుకున్నా..ఫలితమేది..సునీల్!

Sat 06th Aug 2016 05:02 PM
sunil,jakkanna,krishnastami,sunil movies,telugu hero and comedian sunil  నిలబెట్టుకున్నా..ఫలితమేది..సునీల్!
నిలబెట్టుకున్నా..ఫలితమేది..సునీల్!
Advertisement
Ads by CJ

ఈమధ్యకాలంలో  హీరో సునీల్‌ కెరీర్‌ ఇబ్బందులు పడుతోందనే చెప్పాలి. 'భీమవరం బుల్లోడు' తర్వాత ఆయన చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. కాగా ఈమధ్య  ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదికి నాలుగు చిత్రాలను చేస్తానని హామీ ఇచ్చాడు. ఈ ఏడాది ఇప్పటికే ఆయన నటించిన 'కృష్ణాష్టమి', 'జక్కన్న' చిత్రాలు విడుదలయ్యాయి. ఫలితం మాట ఎలా ఉన్నా ఈ రెండు చిత్రాలూ.. విడుదలయ్యాయి. తాజాగా వీరుపోట్ల దర్శకత్వలో ఆయన నటించిన 'ఈడు గోల్డ్‌ ఎహే' చిత్రాన్ని సెప్టెంబర్‌ 19న విడుదల చేస్తామని యూనిట్‌ హామీ ఇచ్చింది. ఇక ఇదే ఏడాది డిసెంబర్‌లోనే ఆయన నటిస్తున్న క్రాంతిమాధవ్‌ చిత్రం కూడా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తానికి ఫలితాలు ఎలా ఉన్నా ఆయన ఈ ఏడాదిలో  మీడియాతో చెప్పినట్లుగానే  నాలుగు చిత్రాలను విడుదల చేయడానికి సిద్ధమై తన మాటను నిలబెట్టుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.  అయినా ఏడాదికి ఎన్ని సినిమాలు చేశాం అన్నది ఇండస్ట్రీలో కొలమానం కాదని, ఇక్కడ హిట్టే ముఖ్యమని,  సునీల్‌ సరైన కథలు ఎంచుకోవడంలో విఫలమవుతుండటం మూలంగానే ఆయన కెరీర్‌ గాడితప్పిందని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ