Advertisementt

జక్కన్నా...నీ లెక్కే వేరన్నా..!!

Sat 06th Aug 2016 06:14 PM
ss rajamouli,bahubali,bahubali 2,rajamouli remuneration,jakkanna  జక్కన్నా...నీ లెక్కే వేరన్నా..!!
జక్కన్నా...నీ లెక్కే వేరన్నా..!!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ టాప్ డైరెక్టర్... నెం 1 డైరెక్టర్ ఎవరు అంటే వెంటనే ఎస్.ఎస్ రాజమౌళి అనేస్తారు. పెద్దవాళ్ళే కాదు పిల్లలు.. ఇంకా యూత్ కూడా ఇష్టపడే డైరెక్టర్స్ లో రాజమౌళి ముందుంటాడు. ఈయనగారు సినిమా తీసాడు అంటే అది ఒక అద్భుతమైన హిట్ అవ్వాల్సిందే. ఆయన తీసిన సినిమాలన్నీ హిట్టే. అందుకే రాజమౌళి అంటే హిట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పేరుగాంచాడు. అలాంటి రాజమౌళి.. బాహుబలి సినిమా తీసి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసి తెలుగు సినిమా గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చూపిన తెలుగువాడిగా కీర్తి గడించాడు. ఆ సినిమా కలెక్షన్స్ పరంగా ఒక సంచలనాన్ని సృష్టించింది. రాజమౌళి.. బాహుబలి సినిమాని డైరెక్ట్ చేసినందుకు గాను అక్షరాలా 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడట. బాహుబలి మొదటి భాగానికే ప్రపంచవ్యాప్తం గా 650 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా... ఇక రెండో భాగానికి 1000 కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా బాహుబలి 2 ని మలుస్తున్నాడని సమాచారం. మరి ఈ రెండో భాగానికి రాజమౌళి రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మీ ఊహ కరెక్టో కాదో తెలీదు కానీ.. రాజమౌళి మాత్రం బాహుబలి 2 వ భాగానికి రెమ్యునరేషన్ గా తెలుగు మినహా మిగతా భాషల్లో బిజినెస్ జరగగా వచ్చే మొత్తం లో సగం తీసుకుంటున్నాడని సమాచారం. మరి ఈ డీల్ కి నిర్మాతలు కూడా ఒప్పుకున్నారని టాక్. ఒప్పుకోక ఏం చేస్తారు.... రాజమౌళికి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. అయితే తెలుగు మినహా మిగతా భాషల్లో బిజినెస్ పరంగా బాహుబలి 2 సినిమా 150 కోట్ల నుండి 200 కోట్ల దాకా ఉంటుందని సమాచారం. మరలా సగం సగం చూసుకుంటే రాజమౌళి రెమ్యునరేషన్ దాదాపు 75 కోట్ల నుండి 100 కోట్లు ఉంటుందని  అంచనా. ఇక ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అంటే రాజమౌళి మరి మామూలు దర్శకుడిగా చూడకూడదు. ఇక బాహుబలి 2 కూడా హిట్ అయితే రాజమౌళి ఏకంగా హాలీవుడ్ కి వెళ్లినా వెళ్లిపోవచ్చు అంటున్నారు సినీ జనాలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ