నేచురల్‌స్టార్‌గా వరుస విజయాలతో దూసుకుపోతున్న యువహీరో నాని తన కెరీర్‌ను చాలా జాగ్రత్తగా మలుచుకుంటున్నాడు. తన మొదటి చిత్రం నుండి వివిధ జోనర్ చిత్రాలు చేస్తూ తనపై ఒక ఇమేజ్ ముద్ర పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాని. ఆయన ఇటీవల 'ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మన్' వంటి విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకుసాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన మార్కెట్ 25 కోట్లకు చేరింది. నాని ప్రస్తుతం 'ఉయ్యాలా..జంపాలా' ఫేమ్ విరించి వర్మతో 'మజ్ను' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఆయన దిల్‌రాజు నిర్మాణంలో 'సినిమా చూపిస్త మావా' దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో రూపొందే చిత్రానికి 'నేను లోకల్' అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేయడమే కాదు.. టైటిల్ పరంగానే కాదు..ఈ చిత్రం కూడా మాస్,యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ జోనరులో నడుస్తుందని సమాచారం. మొత్తానికి తన కెరీర్‌లో ఓ ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా విభిన్న చిత్రాలను ఎంచుకుంటున్న నానిని సూపర్ అని అంటున్నారు.