Advertisementt

బాలయ్య 100 ని దేవిశ్రీ ఎందుకు వదిలేశాడు?

Wed 10th Aug 2016 08:44 PM
devisri prasad,balakrishna 100th movie,gautamiputra satakarni,devisri out in balayya 100th movie,krish director  బాలయ్య 100 ని దేవిశ్రీ ఎందుకు వదిలేశాడు?
బాలయ్య 100 ని దేవిశ్రీ ఎందుకు వదిలేశాడు?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ 100 వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాని ఎలాగైనా సంక్రాంతికి పూర్తి చేసి విడుదల చేయాలని క్రిష్ ఇంకా బాలయ్య భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ యూనిట్ కి ఒక షాక్ తగిలింది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడని అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుండి దేవిశ్రీ తప్పుకున్నాడని వార్తలొస్తున్నాయి. అసలు ఈ సినిమానుండి దేవిశ్రీ ఎందుకు తప్పుకున్నాడా అనే దానికి సమాధానం గా దేవిశ్రీ కి ఈ మధ్య చాల ఆఫర్స్ వస్తున్నాయని మరి శాతకర్ణి కి పని చేస్తే చాలా కాలం ఈ సినిమాకే వర్క్ చెయ్యాలి కాబట్టి మిగతా అవకాశాలు వదులుకోవాల్సి వస్తుందని... ఇంకా తాను అమెరికాలో చేయబోయే లైవ్ కాన్సెర్ట్లు కు కూడా టైం సరిపోదని అందుకే తప్పుకుంటున్నాడని అంటున్నారు. తెలుగులోనే కాకుండా తమిళం లో కూడా దేవిశ్రీ బిజీ అవ్వడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. మరి 'గౌతమిపుత్ర శాతకర్ణి' నుండి దేవిశ్రీ తప్పుకుంటే డైరెక్టర్ క్రిష్ మరో మ్యూజిక్ డెరెక్టర్ గురించి వెతకాల్సిన అవసరం చాలా వుంది. అయితే ఇప్పటికే క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్స్ వేటలో ఉన్నాడని... ఆయన మనసులో ఇళయరాజా ఇంకా కీరవాణి వున్నారని... కొద్ది రోజుల్లో ఎవరినో ఒకరిని ఫైనల్ చేస్తాడని సమాచారం. ఇక క్రిష్ పెళ్లి హడావిడి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ని 'గౌతమిపుత్ర శాతకర్ణి' కి సెట్ చేస్తాడని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ