Advertisementt

నయీమ్ డైరీలో.. లేడీ లీడర్..!

Thu 11th Aug 2016 06:27 PM
uma madhava reddy links with gang star nayim,uma madhava reddy,gang star nayim,  నయీమ్ డైరీలో.. లేడీ లీడర్..!
నయీమ్ డైరీలో.. లేడీ లీడర్..!
Advertisement
Ads by CJ

నయీమ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్టాల్లో ప్రముఖంగా వినపడుతున్న పేరు. అతను ఒక గ్యాంగ్ స్టర్.  హత్యలు , కిడ్నాప్ లు, ల్యాండ్ మాఫియాలో  నయీమ్ పేరు ప్రముఖంగా వినిపించేది. అయితే నయీమ్ కొన్ని వేల కోట్లను సంపాదించాడు. అసలు ఇతను ఇంతలా రెచ్చిపోవటానికి కారణం అతనికి కొంతమంది పొలిటీషియన్స్ ఇంకా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అతనికి ప్రత్యక్షము గాను పరోక్షం గాను సహాయం చేశారని అనుకుంటున్నారు. అందువల్లే నయీమ్ ఎమ్యెల్యేలను కూడా బెదిరించి వాళ్ళ దగ్గర నుండి డబ్బు గుంజేవాడని... ఎటువంటి భయం లేకుండా విచ్చల విడిగా చెలరేగి పోయాడని అంటున్నారు. తెలగాణ ప్రభుత్వం నయీమ్ ని ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. నయీమ్ ఎన్కౌంటర్ అయ్యాక అతని గురించి బోలెడు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు నయీమ్ తో వున్న ప్రముఖుల సంబంధాల గురించి నయీమ్ డైరీ లో కొన్ని విలువైన ఆధారాలు దొరికాయని అంటున్నారు. వారి పేర్లు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. అయితే వారిలో మొదటగా వినిపించిన పేరు టిడిపి నేత ఉమా మాధవరెడ్డి పేరు. ఈమె ఉమ్మడి రాష్ట్రము లో హోమ్ మినిస్టర్ గా పని చేసిన మాధవ రెడ్డి భార్య. అయితే భర్త చనిపోయాక రాజకీల్లోకి వచ్చి టిడిపిలో సీనియర్ నేతగా చలామణి అవుతున్న ఉమా మాధవ రెడ్డి కి... నయీమ్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు దొరికాయని పోలీస్ లు చెబుతున్నారు. నయీమ్ ఇంకా ఉమా మాధవ రెడ్డి మధ్యలో కొన్ని వేల ఫోన్ సంభాషణలు నడిచినట్లు ఆధారాలున్నాయని చెబుతున్నారు. ఇక ఆమె పై కేసు నమోదు చెయ్యడానికి పోలీస్ లు రంగం సిద్హం చేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ