Advertisementt

వెంకీ కూడా ఇష్టపడుతున్నాడు!

Thu 11th Aug 2016 08:03 PM
venkatesh,horror comedy movies,interest,venkatesh movies  వెంకీ కూడా ఇష్టపడుతున్నాడు!
వెంకీ కూడా ఇష్టపడుతున్నాడు!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం దక్షిణాదిన హర్రర్‌ కామెడీ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అందరు హీరోలు ఇలాంటి చిత్రాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.తాజాగా ఓ సరికొత్త పాయింట్‌తో హర్రర్‌ కామెడీ చిత్రం కథ ఉంటే అందులో నటించాలని ఉందని విక్టరీ వెంకటేష్‌ కూడా ఇటీవల మీడియాతో తన మనసులోని మాటను బయటపెట్టాడు. సరికొత్త పాయింట్‌తో ఈ జోనర్‌ తరహా చిత్రం వస్తే చేయాలనుందని తెలిపాడు. ఇప్పటికే లారెన్స్‌లాంటివారు ఇలాంటి చిత్రాలతో తమ సత్తా చాటుతున్నారు. మరి వెంకీ మనసులోని మాటలను బయటపెట్టాడు కాబట్టి వెంకీతో చిత్రాలు చేయాలని భావించే దర్శకులు ఆయన దగ్గరకు ఇలాంటి మంచి కథతో వెళితే, ఖచ్చితంగా వెంకీ ఒప్పుకుంటాడని భావించవచ్చు. వెంకీతో సినిమా చేయాలని భావించే దర్శకులకు ఇదో గోల్డెన్‌ చాన్స్‌ అంటున్నారు. మరి వెంకీ కోరికను తీర్చే దర్శకుడు త్వరలోనే దొరుకుతాడో లేదో చూడాలి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ