Advertisementt

రజనీకాంత్ కూతుళ్లు మళ్లీ ప్లాన్ చేస్తున్నారు!

Fri 12th Aug 2016 06:45 PM
rajinikanth,aishwarya rajinikanth,soundarya rajinikanth,bio pic,super star rajinikanth  రజనీకాంత్ కూతుళ్లు మళ్లీ ప్లాన్ చేస్తున్నారు!
రజనీకాంత్ కూతుళ్లు మళ్లీ ప్లాన్ చేస్తున్నారు!
Advertisement
Ads by CJ

సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూతుర్లిద్దరు మంచి టాలెంట్‌ వున్నవారే. సౌందర్య, ఐశ్వర్యలు తమ తండ్రితో మాత్రం ఆటాడుకుంటున్నారు. సౌందర్య విషయానికి వస్తే ఈమె తన తండ్రి రజనీకాంత్‌, దీపికాపడుకొనేలతో మోషన్‌ పిక్చర్‌ పేరుతో కోట్లు ఖర్చు పెట్టించి 'కొచ్చాడయాన్‌' (తెలుగులో 'విక్రమసింహ') చిత్రం తీసింది. కానీ ఈ చిత్రం కేవలం ఓ కార్టూన్‌ ఫిల్మ్‌ కన్నా అధ్వాన్నంగా ఉందనే చెడ్డపేరుతో పాటు రజనీ ఇమేజ్‌ను, డబ్బులను బూడిదలో పోసింది. ఇక ఐశ్వర్య అయితే తన రియల్‌ హీరో ధనుష్‌తో 'త్రీ' చిత్రం తీసి ప్రశంసలు పొందినా కమర్షియల్‌గా మాత్రం ఫ్లాప్‌గా మిగిలింది. కాగా త్వరలో రజనీ ఇద్దరు కూతుర్లైన సౌందర్య, ఐశ్వర్యలు కలిసి మరోసారి తమ తండ్రి ఇమేజ్‌తో ఆటాడుకోవడానికి రెడీ అవుతున్నారు. త్వరలో ఈ ఇద్దరు అక్కాచెల్లెల్లు సంయుక్తంగా తమ తండ్రి రజనీకాంత్‌ జీవిత చరిత్రను బయోపిక్‌గా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రజనీ సినీ చరిత్రతో పాటు ఆయన నిజజీవిత విశేషాలు, తెర వెనుక జరిగిన ఎన్నో ఆసక్తికర సంఘటనలు వంటివాటిని ఈ బయోపిక్‌లో పొందుపరుస్తామంటున్నారు. ఇప్పటికే ఐశ్వర్య తన తండ్రి జీవిత చరిత్రను పుస్తకంగా రాస్తోంది. ఇది పూర్తయిన తర్వాత ఈ బయోపిక్‌పై వారు దృష్టిపెట్టనున్నారు. మొత్తానికి కూతుర్లకు ఉన్న టాలెంట్‌ రజనీని ఇబ్బందులు పెడుతోంది. కాగా ఈ బయోపిక్‌లో రజనీనే నటించమని వారు ఒత్తిడి తెస్తున్నారట. మరి ఈ బయోపిక్‌లో రజనీ నటిస్తాడా? లేక వేరే ఎవరైనా నటిస్తారా? అనేది వేచిచూడాల్సిన అంశం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ