'నేను..శైలజ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులనే కాదు స్టార్‌హీరోలు, దర్శకనిర్మాతలను కూడా తనవైపుకు దృష్టి మరలేలా చేసుకుంది హీరోయిన్ కీర్తిసురేష్. ఈ చిత్రం చూసినవారు టాలీవుడ్‌లో ఆమె స్టార్‌హీరోయిన్ కావడం ఖాయమని అనుకున్నారు. అదే సమయంలో ఆమె నటించిన కొన్ని తమిళ చిత్రాలు కూడా హిట్టవ్వడంతో కోలీవుడ్‌లో సైతం ఆమె క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం తమిళంలో ఆమె విజయ్, ధనుష్ వంటి స్టార్‌హీరోల చిత్రాల్లో నటిస్తోంది. కాగా ఈ అమ్మడుకు మహేష్‌బాబు-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రంలో అవకాశం వస్తే నో చెప్పింది. అదే కాకుండా మరో స్టార్‌హీరో సరసన కూడా ఆమెకు అవకాశం వస్తే దానిని కూడా చేయనని చెప్పిందని సమాచారం. ఇలా టాలీవుడ్‌లో టాప్‌స్టార్స్‌తో అవకాశం వచ్చినా డేట్స్ లేవని వాటిని తిరస్కరించిన కీర్తిసురేష్ తాజాగా నాని హీరోగా రూపొందనున్న 'నేను..లోకల్' చిత్రంలో నటించడానికి మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఆమె నిర్ణయాలు చూసి సినీ పండితులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్రేజీ స్టార్స్ కి హ్యాండిచ్చిన ఈ భామ ఇప్పుడు నేచురల్ స్టార్‌కు ఓకే అనడం వెనుక ఉన్న అర్దమేమిటో ఎవ్వరికీ అర్దం కావడం లేదు. దాంతో కొందరు సినీ జనం ఆమె రూటే సపరేట్ అని, ఆమె శృతిహాసన్ బాటలో నడుస్తోందని అంటున్నారు. కాగా శృతి కూడా ఇటీవల ఎన్నో స్టార్స్ చిత్రాల్లో అవకాశం వచ్చినా నో చెప్పి, నాగచైతన్యతో 'ప్రేమమ్' చిత్రంలో నటిస్తోందని, కీర్తి కూడా ప్రస్తుతం అదే తిక్కలో ఉందని, కానీ దానికి ఎవ్వరికీ తెలియని ఓ లెక్కుంది అనిపించుకుంటోందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.