Advertisementt

మలియా ఒబామా తాగిందేమిటి..?

Fri 12th Aug 2016 10:00 PM
malia obama was allegedly smoking weed at lollapalooza,malia obama,obama daughter  మలియా ఒబామా తాగిందేమిటి..?
మలియా ఒబామా తాగిందేమిటి..?
Advertisement
Ads by CJ

కుర్రకారుకు కాలేజీ  జీవితమంటేనే ఫ్యాషన్ గా మారింది. కొంతకాలం గడిచాక యువత గతాన్ని తరచి చూసుకున్నప్పుడు వాళ్ళు చేసిన ఘనకార్యాల జాబితా జ్ఞాపకం చేసుకొని మురిసి పోవడానికి అప్పుడప్పుడు వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. ఆ సందర్భంలో వాళ్ళు అది మంచా చెడా అన్నది అస్సలే ఆలోచించరు. 

అలాంటివేవైనా సెలబ్రటీలు గానీ,  వాళ్ళ పిల్లలు గానీ చేశారనుకోండి అది గొప్ప వార్తగా భావించి ప్రపంచమంతా విస్తుపోతుంది. ఇలాంటి సన్నివేశమే ఇప్పుడు జరిగింది. అమెరికా అధ్యక్షుడు పెద్ద కూతురు మలియా ఒబామా ఈ మధ్యనే  హర్వార్డు విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుకోసం చేరింది. అక్కడ జరిగిన ఓ పార్టీలో మలియా మస్తుగా దమ్ము కొడుతున్న ఓ వీడియో యూట్యూబ్ లో సంచలనం రేపుతుంది. ఈ విషయంలో విమర్శలు ప్రతి విమర్శలు చెలరేగిపోతున్నాయి. అయితే అసలు మలియా ఒబామా సిగరెట్టే తాగుతుందా లేకా గంజాయి కలిపిన సిగరెట్టు తాగుతుందా అన్న విషయంలో ఎవరూ ఏకాభిప్రాయానికి రాలేక పోతున్నారు. కానీ మలియా స్నేహితురాండ్రు మాత్రం మలియాకు అస్సలు గంజాయి అలవాటే లేదని, ఎవరో గిట్టని వారు ఇలాంటి తప్పుడు ప్రచారానికి పూనుకున్నారని కొట్టిపారేశారు. మొత్తానికైతే  ఏదో ఒకటి తాగినట్లుగా దొరికిపోయిందిగా.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ