Advertisementt

పుష్కర కాలం నుండి ఎన్టీఆర్ కి హిట్టే లేదు!

Sat 13th Aug 2016 09:17 PM
jr ntr,janatha garage,temper,nannaku prematho,jr ntr speech,janatha garage audio  పుష్కర కాలం నుండి ఎన్టీఆర్ కి హిట్టే లేదు!
పుష్కర కాలం నుండి ఎన్టీఆర్ కి హిట్టే లేదు!
Advertisement
Ads by CJ

కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో 'జనతా గ్యారేజ్' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడియో నిన్న (12-08-16) శిల్ప కళావేదిక లో జరిగింది. ఆడియోలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నేను పుష్కరకాలం నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్నానని.. గతంలో నేను ప్లాప్ సినిమాలు చేస్తున్నపుడు ఈ 'జనతా గ్యారేజ్' కథ శివ నాకు చెప్పాడని కానీ ప్లాప్ సినిమాల హడావిడిలో ఈ సినిమాని రెండు సంవత్సరాలు పోస్ట్ పోన్ చేశాననని అంటూ సంచలనాత్మక వ్యాఖ్యలు చేసాడు. పుష్కర కాలం ముందు 'ఆది, సింహాద్రి' సినిమాలు హిట్ అయ్యాయని... ఇక తర్వాత హిట్లు లేవని... ఏదో సినిమాలు చెయ్యాలి కాబట్టి చేసేశానని అన్నాడు. ఆ టైంలో నేను చాలా సంఘర్షణకు లోనై కుమిలిపోయానని చెప్పుకొచ్చాడు. అలాంటి సమయంలో వక్కంతం వంశీ ఒక కథ చెప్పాడని.. ఆ కథను పూరి గారు డైరెక్ట్ చెయ్యడం వల్ల 'టెంపర్' హిట్ వచ్చిందని... ఇక ఆ తర్వాత సుకుమార్ గారు 'నాన్నకు ప్రేమతో' హిట్ ఇచ్చారని చెప్పాడు. అయితే వాటికన్నా పెద్ద హిట్ 'జనతా గ్యారేజ్' తో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసాడు. అయితే ఎన్టీఆర్ ఇంకో ఆసక్తికరమైన విషయం మాట్లాడాడు. ఒక అభిమాని తన పేరు గురించి ఇలా చెప్పాడట. జూ ఎన్టీఆర్ ని తిరగేస్తే ఇలా వస్తుందని.... ఆర్ అంటే 'రభస' అని,  టి అంటే 'టెంపర్' అని, ఎన్ అంటే 'నాన్నకుప్రేమతో' అని, జె అంటే 'జనతా గ్యారేజ్' అని చెప్పాడట. ఇంకా సమంత తో, నిత్యా తో నటించడం సంతోషం గా ఉందని మోహన్ లాల్ వంటి గొప్ప నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక గొప్ప అవకాశం గా భావిస్తున్నానని చెప్పాడు. ఇక జనతా గ్యారేజ్ సినిమా సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ