Advertisementt

వరుణ్ తేజ్ ఖాతాలో మరొకటి..!

Sun 14th Aug 2016 10:26 AM
varun tej,mister,fidaa,chandu mondeti,varun tej and chandu mondeti movie,karthikeya  వరుణ్ తేజ్ ఖాతాలో మరొకటి..!
వరుణ్ తేజ్ ఖాతాలో మరొకటి..!
Advertisement
Ads by CJ

'కంచె' సినిమా వరుణ్ తేజ్ కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టిందనే చెప్పాలి. ఆ తర్వాత వరుణ్ కు సినిమా తర్వాత సినిమాలు వరుస బెట్టి రావడంతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. శ్రీనువైట్ల సినిమా 'మిస్టర్' తో పాటు శేఖర్ కమ్ముల చిత్రం 'ఫిదా'లో  నటిస్తున్న వరుణ్ తేజ్ మరో థ్రిల్లర్ చిత్రంలో కూడా నటించేందుకు సుముఖత చూపారని టాక్. 

'ఫిదా' సినిమా షూటింగ్ లో మస్త్ బిజీగా ఉన్న వరుణ్ తేజ్ కు 'కార్తికేయ' ఫేమ్ డైరెక్టర్ చందూ మొండేటి కథ వినిపించాడట. కథ విన్న వెంటనే హీరో వరుణ్ కు తెగ నచ్చేసి ఈ సినిమా ఖచ్చితంగా చేద్దాం అన్నట్లు చెప్పాడట. అయితే చేతిలో ఆల్రెడీ రెండు సినిమాలు ఉండి మూడో సినిమా కూడా తన ఖాతాలో జమ చేసుకున్నాడు హీరో వరుణ్ తేజ్. థ్రిల్లర్ మూవీగా ఉండే ఈ చిత్రంలో గజనీ స్టైల్లో కథ కథనాలు సాగుతాయని తెలుస్తుంది. ఏదో మెడికల్ కండిషన్ కు సంబంధించిన సమస్యలు రావడం, దాంతో జంతువులకు హిప్నాటిజం చేయడం వంటి గొప్ప కథాంశంతో కూడిన చిత్రంగా చందూ మొండేటి కథను రూపొందించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం చేసేందుకు ప్రొడ్యూసర్స్ కూడా రెడీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఆ నిర్మాతలు ఎవరన్న విషయం, సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ