Advertisementt

సాయి తిక్క కి..బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి!

Sun 14th Aug 2016 04:07 PM
allu arjun,thikka,sai dharam tej,bunny fans happy with thikka result,sunil reddy  సాయి తిక్క కి..బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి!
సాయి తిక్క కి..బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి!
Advertisement
Ads by CJ

తెలుగు సినీ పరిశ్రమలో గడచిన కొంతకాలంగా చిరంజీవి సైడ్ అభిమానులకు, అల్లు సైడ్ అభిమానులకు మాటల వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమా పరమైన ఆడియో, ట్రైలర్స్ వంటి వేదికలపై ఎవరైనా ఆయా కుటుంబికుల గురించి తేడాగా మలచుకున్నా, మాట్లాడినా వెంటనే అభిమానులు తమదైన శైలిలో రెచ్చిపోతుంటారు. అందుకు సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా వాడుకుంటుంటారు. అప్పట్లో సరైనోడు ఫంక్షన్ వేదికపై పవర్ స్టార్ పవన్ కళ్యాన్... అని అభిమానులు పెద్ద ఎత్తున గొడవ చేస్తుంటే అది బన్నీకి చిరాకు తెప్పించి పవన్ కళ్యాన్ గురించి నేనేం చెప్పను అన్నట్లు వ్యవహరించడంతో మెగా అభిమానులు రెచ్చిపోయారు. దాంతో మరో వేదికపై అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చేంత వరకు ఆ గొడవ సద్దుమనగలేదనుకోండి. ఆ తర్వాత తిక్క ఆడియో ఫంక్షన్ ను వేదికగా చేసుకొని సాయి ధరమ్ తేజ్ అభిమానులను ఉద్దేశించి రెచ్చిపోయేలా 'అరవండి పెద్దగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్' అంటూ రెచ్చి కొట్టాడు. దాంతో అందరూ అప్పట్లో అల్లు అర్జున్ పవన్ పై కౌంటర్ కు సాయి ధరమ్ తేజ్ ఎన్ కౌంటర్ చేశాడా ? అన్నట్లుగా భావించారు.  

తొలినాళ్ళలో అల్లు అర్జున్ మెగా అభిమానిగా వారి పేరునే వాడుకుంటూ స్టైలిష్ స్టార్ ఇమేజ్ సాధించుకున్నాడు. కానీ ఆ తర్వాత తర్వాత సొంత ఇమేజ్ ను వ్యక్తిగతంగా పెంచుకోవడం..అలా రాణించడం మొదలు పెట్టాడు. అందుకే పపవ్ విషయంలో అలా వ్యవహరించాడని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అది సరే అల్లు అర్జున్ కౌంటర్ కి సాయి ధరమ్ తేజ్ ఎన్ కౌంటర్ వేశాడు. అది ఓకే సరిపోయింది. కానీ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం. ఈయన తిక్క ఇలా ఉందా, ఆ తిక్కేదో విడుదల రోజు చూసుకుందాం.. అని చూస్తుండిపోయారు. సరిగ్గా తిక్క విడుదలై డిజాస్టర్ గా ప్రేక్షకుల ముందు నిలవడంతో తిక్క బాగా కుదిరిందా? అంటూ ఫుల్ ఖుషి అయిపోతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ