టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్ అందరూ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే పాలసీని ఫాలో అవుతున్నారు. తమ స్టార్ స్టేటస్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో చెప్పలేని పరిస్దితుల్లో వారు అలా ఆలోచించడం తప్పు కూడా కాదు. ఇప్పటివరకు సినిమాలలో నటించేందుకు భారీ రెమ్యూనరేషన్, యాడ్స్, మాల్స్ ప్రారంభోత్సవాలు వంటి ద్వారా బ్యాంకు బ్యాలెన్స్‌లను పెంచుకుంటోన్న స్టార్‌హీరోయిన్లు ఇప్పుడు తమ క్రేజ్‌ను సెల్ఫీల ద్వారా కూడా పెంచుకునే ఉపాయాన్ని కనిపెట్టారు. ప్రముఖ టాప్ కంపెనీలతో వీరు టైఅప్ అవుతున్నారు. మొబైల్ కంపెనీలు కూడా వీరి క్రేజ్‌ను వాడుకోవడానికి ముందుకొస్తున్నాయి. తమ మొబైల్ కంపెనీ పేరు కనిపించేలా ఈ ముద్దుగుమ్మలు సెల్ఫీలు దిగి, వాటిని ట్విట్టర్స్‌తో పాటు పలు సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. అలా తమ కంపెనీ మొబైల్ పేరు కనిపించేలా ప్రచారం చేసినందుకు ఈ స్టార్‌హీరోయిన్లు లక్ష రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారు. దీంతో స్టార్‌హీరోయిన్ల బ్యాంకు బ్యాలెన్స్‌లు కూడా బాగానే కళకళలాడతున్నాయి.