మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కిన 'బాబు బంగారం' గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల రోజు నుండి నెగెటివ్ టాక్ తో నడుస్తున్నా..కలెక్షన్ విషయంలో మాత్రం టాప్ ప్లేస్ లోనే వుంది. ఈ సినిమాలో మారుతి కామెడీ కి పెద్ద పీట వేశాడు. అయితే ఈ కామెడీకి సంబంధించి ఒక విషయం పై ఇప్పుడు పెద్ద దుమారమే చెలరేగింది. ఈ సినిమాలో సుకుమార్ ని కించపరిచేలా మారుతి డైలాగ్స్ వాడటమే..ఈ దుమారానికి కారణం. కమెడియన్ పృథ్వి చేత కావాలనే మారుతి.. సుకుమార్ పై సెటైర్స్ వేయించాడని అంటున్నారు. అదెలా అంటే 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎన్టీఆర్ గెటప్ వేసుకుని పృథ్వి మిడ్ నైట్ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా నాన్నకు ప్రేమతో సినిమాలో మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. ఇక పృథ్వి నీకు 'నాన్నకు ప్రేమతో' సినిమా అర్ధం కాలేదా అని హీరోయిన్ ని అడిగితే.. ఆమె ఉహూ అంటుంది..... అప్పుడు పృథ్వి నీకు అర్ధం కాలేదా అయితే అది సూపర్ హిట్టే అంటాడు. అంటే సుకుమార్ తీసే సినిమాలు ప్రేక్షకులకు అర్ధం కాకపోయినా అవి హిట్ ఎలా అవుతున్నాయి అనేగా మారుతి ఉద్దేశ్యం? లేకపోతే ఇలాంటి డైలాగ్స్ ఎందుకు పెడతాడు మారుతి అంటున్నారు సినీ ప్రేమికులు. మరి మారుతి ఏదైనా అలా డైరెక్టుగా డైలాగ్స్ చెప్పించకుండా ఉంటే బాగుండేదని.... డైరెక్టర్ సుకుమార్ తీసిన కొన్ని సినిమాలు తెలివితేటలకు అద్దం పట్టేలా వుంటాయని...టాప్ డైరెక్టర్ రాజమౌళినే ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అంతే కాదు తనకు పోటీ సుకుమారే అని రాజమౌళి ప్రత్యేకంగా ఒప్పుకున్నాడు కూడా. అలాంటి సుకుమార్ని..మారుతి కించపరచకుండా ఉండాల్సిందని సినీ ప్రేమికులు అంటున్నారు.