నాగ చైతన్య - సమంత లవ్ లో వున్నారని... ఇక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనేది తెలిసిన విషయమే. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ రోజు రోజుకు పెరిగిపోతుందని... వీరిద్దరూ ట్విట్టర్లో ఆక్టివ్ గా ఉండటంతో మరోసారి ఈ విషయం రుజువైంది. అయితే తాజాగా వీరి మధ్యలోకి రానా వచ్చి చేరాడు. రానా - నాగ చైతన్య ఇద్దరు బావ-బావమరుదులు. రానా తన బావ ప్రేమ కోసం చాలానే చేస్తున్నాడు. ఆమధ్య చైతన్య - సమంతల కు ప్రైవసీ కలిపించడానికి.. రానా కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి టూర్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇపుడు మళ్ళీ ట్విట్టర్ సాక్షిగా మరోసారి వీరిద్దరూ మాట్లాడుకునేలా చేసాడని ఈ ట్వీట్స్ చూసిన ఎవరికైనా అర్ధం అవుతుంది. రానా - నాగ చైతన్య - సమంత మధ్య ట్విట్టర్ లో కొన్ని ఆసక్తికర సంభాషణలు జరిగాయి. అవి ఏమిటంటే వెంకటేష్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30 సంవత్సరాలు అయినా సందర్భం గా రానా తన బాబాయ్ గురించి ఇలా ట్వీట్ చేసాడు. తనకు తన బాబాయ్ నటించిన సినిమాల్లో నచ్చిన సినిమా 'బొబ్బిలి రాజా' అని ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ కి సమంత ప్లీజ్ టెల్.. నీకు ఇష్టమైన సినిమా ఏంటో చెప్పు.. ప్లీజ్ అని నాగ చైతన్యని ఉద్దేశించి ట్వీట్ చేసింది. వెంటనే నాగ చైతన్య నాకు మావయ్య సినిమాల్లో నచ్చిన సినిమా 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' అని రీ ట్వీట్ చేశాడు. ఇక ఈ రీ ట్వీట్ పై స్పందించిన రానా వాహ్...వాహ్...వాహ్ అంటూ ట్వీట్ చేసాడు. మరి సమంతను చైతన్యను ట్విట్టర్ సాక్షిగా మాట్లాడుకోవడానికి రానా డైరెక్టుగా సహకరించాడుగా అని చెవులు కోరుకుంటున్నారు అందరూ.