Advertisementt

అవసరాల ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా వుంది!

Wed 17th Aug 2016 07:01 PM
jo achyutananda,jo achyutananda interesting trailer,jo achyutananda trailer review,nara rohit,regina,naga sourya,avasarala srinivas,vaarahi  అవసరాల ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా వుంది!
అవసరాల ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా వుంది!
Advertisement
Ads by CJ

'అష్టా చెమ్మా' సినిమాలో నటించిన శ్రీనివాస్ అవసరాల.. ఆ సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో డైరెక్టర్ గా కూడా మంచి పేరు సంపాదించాడు. అతనిలో నటనతో పాటు ఒక గొప్ప డైరెక్టర్ ఇంకా రచయిత ఉన్నాడనే విషయము తెలిసిందే. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో ఇండస్ట్రీలో  డైరెక్టర్ గా అడుగు పెట్టి... డైరెక్షన్ చేసిన మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన అవసరాల ఇప్పుడు 'జ్యో అచ్యుతానంద' అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. 'జ్యో అచ్యుతానంద' చిత్రాన్ని శ్రీనివాస్ అవసరాల.. నారా రోహిత్ - నాగశౌర్య - రెజీనాని హీరో హీరోయిన్స్ పెట్టి తెరకెక్కిస్తున్నాడు. 'జ్యో అచ్యుతానంద' టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో నాగశౌర్య, నారా రోహిత్ ఇద్దరు రెజీనాని ప్రేమలో పడేయడానికి ఎవరికి వారు వేసే ఎత్తులు గురించి... వారు ఆమె ని ఇంప్రెస్ చెయ్యడానికి పడే పాట్లు గురుంచి అవసరాల ఈ టీజర్ లో చూపించాడు. ఇక నారా రోహిత్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. రెజినా తన ఎక్సప్రెషన్స్ తో ఆకట్టుకుంది. నాగ సౌర్య గురుంచి చెప్పక్కర్లేదు. అతను లవర్ బాయ్ గా చేసిన సినిమాలన్నీ హిట్టే. మరి ఈ టీజర్ తో సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి వారాహి చలన చిత్ర బ్యానర్  మీద నిర్మిస్తున్నాడు. 'ఊహలు గుసగుసలాడే' తో సైలెంట్ గా హిట్ కొట్టిన శ్రీనివాస్ అవసరాల..ఈ  'జ్యో అచ్యుతానంద' తో ఎలాంటి హిట్ కొడతాడో చూద్దాం.

Click Here to see the Jo Achyutananda Movie Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ