సూపర్ స్టార్ మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మహేష్ బాబు పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ మురుగదాస్. అయితే ఈ సినిమాకి ఇంకా టైటిల్ అంటూ ఏమి అనుకోలేదు. కనీసం వర్కింగ్ టైటిల్ గా కూడా ఏ పేరు బయటికి రాలేదు. అయితే ఈ సినిమా టైటిల్ ని దసరా సందర్భం గా రివీల్ చేస్తారని సమాచారం. న్యాయ వ్యవస్థ లోని లోటు పాట్లను తెరమీద చూపించడానికి డైరెక్టర్ మురుగదాస్ ఈ సినిమా ని తెరకెక్కిస్తున్నాడు. అయితే న్యాయ వ్యవస్థ మీద తీస్తున్న స్టోరీ కాబట్టి 'ఎనిమి' అనే టైటిల్ బావుంటుంది అని డైరెక్టర్ మురుగదాస్ కూడా దీనినే పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక ఫస్ట్ లుక్ ని జనవరిలో విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం లో మహేష్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.