Advertisementt

చిన్న సినిమాల సంబురంలో శర్వానంద్ ..!

Thu 18th Aug 2016 03:46 PM
sharwanand,new movie,small movies,overseas,sharwanand happy,small movies big collections,big collections  చిన్న సినిమాల సంబురంలో శర్వానంద్ ..!
చిన్న సినిమాల సంబురంలో శర్వానంద్ ..!
Advertisement
Ads by CJ

ఈ మధ్య చిన్న సినిమాలు  విడుదలై భారీ కలెక్షన్లతో దుమ్ము లేపుతున్న విషయం తెలిసిందే. ఓవ‌ర్సీస్ లో కూడా అదిరిపోయేలా వసూళ్ళు రాబడుతున్నాయి. కోటి రూపాయలతో చేసిన 'పెళ్లి చూపులు' సినిమా ఏకంగా పదిహేను కోట్లు వసూళ్ళు చేసింది. ఓవర్సీస్ లో కూడా ఇరవై లక్షలకు కొంటే దాదాపు ఆరు కోట్లు వసూళ్ళు రాబట్టింది.  'పెళ్లి చూపులు' సంబంరంతో ఓవ‌ర్సీస్‌ అంతా చిన్న సినిమాలపై  ఎగ‌బ‌డుతుంది. మొన్న నాని సినిమా 'మ‌జ్ను' రూ. 3 కోట్లకు అప్పుడే అమ్ముడు అయిపోయింది. ఇప్పుడు శ‌ర్వానంద్ సినిమా కూడా మంచి రేటు ప‌లికింద‌ని స‌మాచారం అందుతుంది.  'రన్‌రాజారన్‌, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌ రాజా' వంటి సినిమాలతో మంచి విజయవంతమైన సినిమాలతో దూసుకుపోతున్నాడు శ‌ర్వానంద్‌. సినిమాకి, సినిమాకీ అత‌ని మార్కెట్ పెరుగుతూ ఉంది.  ప్రస్తుతం  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో క‌థానాయ‌కుడిగా శర్వానంద్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాకి అప్పుడే క్రేజ్ మొద‌లైంది.  అంతేకాదు ఈ సినిమా ఓవ‌ర్సీస్ హ‌క్కులు కూడా మంచి ధ‌ర‌కు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తుంది.  నిర్వాణ సినిమాస్ సంస్థ 2.25 కోట్లకు ఈ సినిమా హ‌క్కుల్ని కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. దీంతో పరిశ్రమలో శర్వానంద్ స్థాయికి ఇది మంచి రేటు పలికినట్లుగానే భావిస్తున్నారు. కాగా ఇది చిన్న సినిమాల కాలం అంటూ శర్వానంద్ పండగ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ