'జనతా గ్యారేజ్' సినిమా విడుదలకు ఇంకా చాలా రోజలు టైమ్ ఉన్నప్పటికీ... ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ చిత్రంపై ఇంతగా హైప్ ఏ చిత్రానికి రాలేదు. దానికి కారణం దర్శకుడు కొరటాల శివ గత చిత్రాలు సాదించిన విజయాలే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. నెలరోజుల ముందు వచ్చిన టీజర్‌కు ఎంతో మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఇప్పటికే విడుదలైన ఆడియో, ట్రైలర్స్‌తో ఈ చిత్రంపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్‌లో ఈ చిత్రం ట్రైలర్‌కు ఇప్పటికే 30లక్షలు మించిన వ్యూస్ వచ్చాయి. మొత్తం మీద ఈ చిత్రానికి ఇంత హైప్ రావడానికి కారణం దర్శకుడు కొరటాల శివనే అంటున్నారు.