కృష్ణ పుష్కర స్నానం చేయడానికి వరుసగా సినీ నటులు క్యూ కడుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ నుంచి మొదలుపెట్టి కళ్యాణ్ రామ్, హీరో శివాజీ ఇలా పలువురు తారలు కూడా పవిత్ర కృష్ణానదిలో పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. కాగా సినీ నటుడు శివాజీ విజయవాడలో ఆసక్తికరంగా కొన్ని అంశాలను వెల్లడించారు. ఏకంగా ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పై ఈ సారి బాణపరంపర కొనసాగించాడు. ఆయన లక్ష్యం ఏంటనేది దీన్ని బట్టి అర్ధమౌతుందనే అనుకోవాలి. విషయం ఏంటంటే వైసీపీ అభిమానులు తమపై సోషల్ మీడియాలో పేలుస్తున్న అవాకులు, చవాకులు మంచిది కాదని వెల్లడించాడు. అలా మాట్లాడటం వారికి, ఆ పార్టీ అధినేత జగన్ కు సమంజసంగా లేదని తెలిపాడు. అదేంటంటే ఈ మధ్య ఆ వైకాపా నాయకులు ఈ హీరోగారిని కులం ప్రస్తావిస్తూ పిలుస్తున్నారంట. అలా కులం పేరుతో పిలవడంతో వైకాపా అభిమానులపై, అధినేతపై ఏకంగా హీరో శివాజి కత్తి దూశాడు. తన వాక్బాణాలను సంధించాడు. సోషల్ మీడియాలో పరంపరగా వస్తున్న కామెంట్లను శివాజీ ప్రస్తావించాడు. అసలు తాను ఏమాత్రం తమ కులంకోసం పోరాడటం లేదని, రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నానని శివాజీ వెల్లడించాడు. ఇంతటితో బాగనే ఉంది కానీ ఆయన నోటి నుండి ఇప్పుడు ఈ చంద్రబాబు ప్రస్తావన ఎందుకు వచ్చింది..? ఎవరైనా తనను కులం పేరుతో ఉద్యమాలు చేస్తున్నాడని భావిస్తే అందుకు చంద్రబాబు ఇంటి ముందే ఉరి వేసుకొంటా అనడం ఏంటి..? ఏమిటి శివాజీ ఈ మాటలు. ఏమన్నా కులానికి చంద్రబాబు ఇంటికి సంబంధం ఉందా..? ఉంది. ఎదుకంటే గతంలో కూడా అమెరికా వెళ్ళిన సందర్భంలో తాను చంద్రబాబు వీరాభిమానినని, బాబు ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నాడని, అందుకోసం నిరంతరం శ్రమిస్తున్నాడని వివరించాడు. అసలీ మధ్య శివాజీకి తెదేపాపై మనసు పడినట్టుంది. అలా పడకపోతే ప్రత్యేకహోదా విషయంలో ఏపీ ప్రభుత్వం, కేంద్రప్రభుత్వంపై నిరాహార దీక్ష చేసిన శివాజీ ఇప్పుడు విడ్డూరంగా ఇలా మాట్లాడుతున్నాడంటే అందుకు ఏదో ఆశించే ఉద్దేశం ఉందనేగా..? అందుకే శివాజీ మాటలు ఇలాంటి సంకేతాలే ఇస్తున్నట్లగా తెలుస్తుంది. లేకపోతే సోషల్ మీడియాలో పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తారు, దానికి ఆ పార్టీ నాయకులకు, వైకాపా అధినేతకు హెచ్చరికలు జారీ చేయడం ఏంటి..?