Advertisementt

ఒలింపిక్స్ లో సింధు సంచలనం!!

Fri 19th Aug 2016 01:48 PM
p.v.sindhu,olimpik,rio olympics,badminton,finals,gold medal  ఒలింపిక్స్ లో సింధు సంచలనం!!
ఒలింపిక్స్ లో సింధు సంచలనం!!
Advertisement
Ads by CJ

హైదరాబాదుకు చెందిన ఓ సంచలనం పీవీ సింధు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో ఫైనల్లోకి ప్రవేశించి వంద కోట్ల మంది భారతీయులను ఆనందంతో ముంచెత్తింది. సెమీ ఫైనల్లో జపాన్ షట్లర్ ఓకుహారాపై వరుసగా ఆడిన గేముల్లో 21-19, 21-10 తేడాతో విజయం సాధించింది. తొలి గేమ్ హోరా హోరీగా సాగింది. ప్రతి పాయింట్ ను చమటోడ్చి సాధించింది. రెండో గేమ్ మొదటి 10 నిమిషాలు సింధుకు ఓకుహారా మంచి పోటీగా నిల్చింది. తర్వాత సింధు దూకుడుకు తల వంచక తప్పలేదు. కాగా  ఈ విజయంతోటి  సింధు ఫైనల్లోకి  ప్రవేశించినట్లయింది. ఫైనల్స్ లో  సింధు స్పెయిన్ అమ్మాయి కరోలినా మారిన్ తో తలపడాల్సి ఉంది.  ఇక్కడ  గాని విజయం వరిస్తే సింధుకు స్వర్ణ పతకం దక్కించుకుటుంది. కాగా  శుక్రవారం సాయంత్రం 7.30కి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.అదేంటో గానీ ఈ సారి  చాలా మంది భారతీయ క్రీడాకారులు రియోలో విఫలమయ్యారు. ఆ దిశగా చూస్తే  సింధు సఫలమయ్యిందనే చెప్పాలి. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో ఫైనల్స్ కు చేరిన తొలి భారతీయ మహిళగా సింధు చరిత్ర సృష్టించింది.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ