Advertisementt

రెజీనాకి బంపర్‌ ఆఫర్‌...!

Fri 19th Aug 2016 10:19 PM
regina,bollywood,dress style,aankhen 2 film announcement,regina style,bollywood offer  రెజీనాకి బంపర్‌ ఆఫర్‌...!
రెజీనాకి బంపర్‌ ఆఫర్‌...!
Advertisement
Ads by CJ

రెజీనాతో పాటే ఇండస్ట్రీకి వచ్చిన వారు, ఆ తర్వాత వస్తున్న కొందరు హీరోయిన్లు స్టార్‌ హీరోయిన్లుగా చలామణి అవుతున్నా.. రెజీనా మాత్రం కేవలం మీడియం, చిన్నస్దాయి హీరోలతోనే సర్దుకుపోతోంది. ఈ అమ్మడుకి ఇంకా సరైన బ్రేక్‌ రాలేదనె చెప్పాలి, అందం, టాలెంట్‌, గ్లామర్‌షోలకు, చివరకి లిప్‌లాక్‌లకు కూడా ఓకే చెప్పినా కూడా ఈ చెన్నై సుందరిని దర్శకనిర్మాతలు పట్టించుకోవడం లేదు ప్రస్తుతం ఆమె దక్షిణాదిన 'జ్యో అచ్యుతానంద', తమిళ తెలుగు భాషల్లో దర్శకుడు సెల్వరాఘవన్‌ తీస్తున్న చిత్రం. 'హంటర్‌' రీమేక్‌లే ఉన్నాయి. కాగా ఈ అమ్మడికి ప్రస్తుతం అనుకోకుండా అదృష్టం తలుపుతట్టింది. అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'ఆంఖేన్ 2'లో ఈ అమ్మడికి అవకాశం వచ్చింది. ఇటీవల జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె బికినీని తలదన్నే రీతి డ్రస్‌లో వచ్చింది. అటు బాలీవుడ్ లోకి అడుగు పెట్టగానే దక్షిణాది హీరోయిన్స్ లాగా ఆమె డ్రెస్ స్టైల్ మారిపోయిందిగా అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి బాలీవుడ్‌ అయినా ఈ అమ్మడు కలిసోస్తుందో లేదో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ