Advertisementt

మహేష్‌ అభిమానులకు ఇది గుడ్‌న్యూస్‌..!

Sat 20th Aug 2016 12:52 PM
mahesh babu,krishna,gowtham krishna,alluri seetharama raju movie,1 nenokkadine movie,super star,child artist,hero  మహేష్‌ అభిమానులకు ఇది గుడ్‌న్యూస్‌..!
మహేష్‌ అభిమానులకు ఇది గుడ్‌న్యూస్‌..!
Advertisement
Ads by CJ

సాధారణంగా హీరోల కుమారులు కూడా హీరోనే అవుతారని వారి అభిమానులు ముందుగానే ఫిక్సయిపోతారు. దాంతో వారసుల చిత్రాలపై అందిరికీ ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడుతుంటాయి. హీరో కృష్ణ తనయునిగా మహేష్‌బాబు కూడా బాలనటునిగా నటించి... ఇప్పుడు సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. అయితే మహేష్‌బాబు తనయుడు గౌతమ్‌కృష్ణ కూడా ఇప్పుడు తన తండ్రి దారిలో ఇటీవల వచ్చిన మహేష్‌ '1' (నేనొక్కడినే) చిత్రంలో బాలనటునిగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం కృష్ణ సినీ జీవితంలోనే అద్భుతమైన చిత్రంగా నిలిచిన 'అల్లూరి సీతారామరాజు' చిన్ననాటి విశేషాలు, బాలునిగా ఆయన చిన్నతనంలో పెరిగిన, నేర్చుకున్న దేశభక్తి, బాల్యస్మృతులు వంటి అంశాలతో ఓ స్క్రిప్ట్‌ను కూడా రెడీ చేశారని సమాచారం. ఈ చిత్రాన్ని  కృష్ణవంశీ డైరెక్ట్‌ చేస్తాడని అంటున్నారు. ఇదే నిజమైతే ఇక మహేష్‌ ఫ్యాన్స్‌కు పండగే పండగ అని అనుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ