ఎప్పుడెప్పుడా అని మెగాభిమానులు ఎదురుచూస్తున్న చిరంజీవి 150వ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను చిరు జన్మదినోత్సవం సందర్బంగా ఆగష్టు 22న రిలీజ్ అవుతుందని ప్రకటించిన రామ్‌చరణ్ అనుకున్న తేదీకే ఇవి విడుదల అవుతాయని స్పష్టం చేశాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్‌ను సైతం ఆయన విడుదల చేశాడు. పక్కాగా అనుకున్నతేదీకే టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల విషయంలో నిర్మాతగా కూడా చరణ్ మంచి ప్లానింగ్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడని, తన చిత్రాల లాగే నిర్మాతగా కూడా సినిమా ప్రారంభం రోజునే విడుదల తేదీ ప్రకటించేంతగా... రామ్‌చరణ్ మంచి ప్లానింగ్ చేసే వాడిగా ఇప్పటికే పేరుతెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం నిర్మాతగా కూడా అదే కమిట్‌మెంట్‌తో ముందుకు వెళ్లడం చూస్తే చరణ్ భవిష్యత్తులో తప్పకుండా మంచి నిర్మాతగా మారడం ఖాయమంటున్నారు. మొత్తానికి ఇటీవలే తన 'ధ్రువ' చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా మెగాభిమానులకు సంతోషం పంచి పెట్టిన చరణ్, ఒక్క వారం గ్యాప్‌లోనే తన తండ్రి చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇచ్చి ఆనందంలో ముంచెత్తాలని ప్లాన్ చేస్తున్నాడు.